గడచిన కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగిస్తున్నారు. ఇందులో చిన్నారులు కూడా ఉంటున్నారు. అయితే చిన్నారులు వీటిని వినియోగించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారం సంస్థ ఇన్స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంస్టాగ్రామ్ ను వినియోగిస్తున్న వారిలో ఐదేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల ముసలి వరకు ఎంతోమంది ఉంటున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇన్స్టా రీల్స్ చూస్తుంటారు. దీనివల్ల పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని గ్రహించిన ఇంస్టా కొన్ని మార్పులు చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
గడచిన కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగిస్తున్నారు. ఇందులో చిన్నారులు కూడా ఉంటున్నారు. అయితే చిన్నారులు వీటిని వినియోగించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారం సంస్థ ఇన్స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంస్టాగ్రామ్ ను వినియోగిస్తున్న వారిలో ఐదేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల ముసలి వరకు ఎంతోమంది ఉంటున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇన్స్టా రీల్స్ చూస్తుంటారు. దీనివల్ల పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని గ్రహించిన ఇంస్టా కొన్ని మార్పులు చేసింది. ఇకపై 16యాలలోపు చిన్నారులు ఇన్స్టాల్ లైవ్ లోకి రావడానికి అనుమతించకూడదని నిర్ణయించింది. ఇంస్టాగ్రామ్ సవరించిన మార్పుల ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి రావాలంటే పేరెంట్స్ అనుమతి తప్పనిసరి చేసింది. వారి అనుమతి లేనిదే లైవ్ ఆప్షన్ వాడుకోవడానికి వీలు లేకుండా చేసింది.
డైరెక్ట్ మెసేజ్ లో న్యూ డ్యూటీ ఉన్న కంటెంట్ కూడా తల్లిదండ్రుల అనుమతి లేకుండా 16 ఏళ్ల పిల్లలకు కనిపించదు. ఇదే విషయాన్ని తాజాగా మెటా తన బ్లాగ్ లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఒక్క ఇంస్టాగ్రామ్ లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఇందులో టీనేజర్లకు రక్షణగా నిలిచేందుకు మార్పులు చేసినట్లు మెటా పేర్కొంది. సోషల్ మీడియా కారణంగా యువత పెడదారి పడుతున్న విమర్శలు నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే మెటా కీలకమైన అప్డేట్స్ను తీసుకువచ్చింది. వాటికి మరిన్ని అప్డేట్స్ చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ లో జరిగే యాక్టివిటీని ట్రాక్ చేసుకునే వీలుగా ఫెసిలిటీషను సెప్టెంబర్ లోనే తీసుకువచ్చింది. టీం అకౌంట్ ప్రోగ్రాం ద్వారా నిరంతరం వాళ్లను గమనించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న మార్పులు మొదట యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలోని వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. వచ్చే నెలలో ప్రపంచ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
తాజాగా తీసుకువచ్చిన ఈ మార్పులు వల్ల అనేక రకాలుగా ఉపయోగ కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు అనుమతి ఇస్తే తప్ప పదహారేళ్లలోపు టీనేజర్లు ఇంస్టాగ్రామ్ లైవ్ ను వాడుకోలేరు. డైరెక్ట్ మెసేజ్ లో న్యూ డ్యూటీ ఉన్న చిత్రాలు బ్లర్ అవుతాయి. దాన్ని చూసేందుకు ప్రయత్నించిన వీలుకాదు. ఆ ఆప్షన్ ఆఫ్ చేయడానికి లేదు. ఫేస్బుక్ మెసెంజర్ ప్లాట్ఫాములకు టీం అకౌంట్ సెక్యూరిటీని మరింత విస్తరించేందుకు మెటా ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు ఇన్స్టాలో తీసుకున్న సెక్యూరిటీ మెజర్స్ ను అందులో ఇంప్లిమెంట్ చేయనున్నారు. టీనేజర్ల అకౌంట్స్ ను డిఫాల్ట్ గా ప్రైవేట్ గా సెట్ చేసి ఉంటుంది. తెలియని వ్యక్తుల నుంచి ప్రైవేట్ మెసేజ్లు రావు. సెన్సిబుల్ కంటెంట్ పై కూడా చాలా ఆంక్షలు ఉంటాయి. ఈ యాప్ కంటిన్యూగా గంటపాటు వినియోగిస్తే అలారం వినిపిస్తుంది. ఇక చాలు అని చెప్పే అలారమ్స్ అన్నమాట. రాత్రి వేళల్లో కూడా నోటిఫికేషన్లు రాకుండా చేస్తున్నారు. ఇలా అనేకమైన అప్డేట్స్ ను మెటా తీసుకువచ్చింది.