ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో గడిచిన కొద్ది నెలల నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఆయన బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ ను పలుమార్లు కోర్టులు తిరస్కరించాయి. దీంతో ఆయన జైలులో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో గడిచిన కొద్ది నెలల నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఆయన బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ ను పలుమార్లు కోర్టులు తిరస్కరించాయి. దీంతో ఆయన జైలులో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. తాజాగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణ అనంతరం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో సుదీర్ఘ పోరాటం తర్వాత అరవింద్ కేజ్రివాల్ జైలు నుంచి బయటకు రాబోతున్నారు. దీంతో ఆప్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. లిక్కర్ కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదు అన్న షరతుతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమారు ఆరు నెలలపాటు తీహార్ జైల్లో ఉన్న ఆయన బెయిల్ లభించడంతో విడుదల కానున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆప్ నేతలు, కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జైలు బయట మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
మద్యం పాలసీకి సంబంధించిన గతంలో ఈడి నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. తాజాగా సిబిఐ నమోదు చేసిన కేసులోనూ సర్వోన్నత న్యాయస్థానం అరవింద్ కేజ్రీవాల్ కు మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు పలు షరతులను విధించింది. 10 లక్షల రూపాయల పూచీకత్తుతోపాటు ఇద్దరు షూరిటీలతో బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో ఈ కేసు గురించి ఎక్కడ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. సీఎం కార్యాలయానికి వెళ్ళరాదని, అధికారిక ఫైలుపై సంతకాలు సైతం చేయరాదని స్పష్టం చేసింది. కేసు విచారణ కోసం ట్రైన్ కోర్టు ఎదుట హాజరుకావాలని వెల్లడించింది. ఈ షరతులతో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తుల హక్కులను హరించడమేనని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలను చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సరైందే అయినా, చేసిన సమయం మాత్రం సరిగాలేదని అభిప్రాయపడింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సిబిఐ అరెస్టు చేయడం సమంజసం కాదని స్పష్టం చేసింది.