గడిచిన కొద్దిరోజులు నుంచి ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు శుభవార్త. భానుడి భగభగల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. రానున్న నాలుగు రోజలపాటు పలుచోట్ల వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం నుంచి నాలుగురోజులు క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
ప్రతీకాత్మక చిత్రం
గడిచిన కొద్దిరోజులు నుంచి ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు శుభవార్త. భానుడి భగభగల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. రానున్న నాలుగు రోజలపాటు పలుచోట్ల వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం నుంచి నాలుగురోజులు క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగళ్లు కురుస్తాయని హెచ్చరించింది.
ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నల్లగొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానరులు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ చేసింది. గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ చేసింది. రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురవున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.