క్యాన్సర్ బారినపడి చికిత్స పొందుతున్న రోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్యాన్సర్ రోగులు వినియోగించే మందులకు సంబంధించి ఇప్పటి వరకు వసూలు చేస్తున్న కస్టమ్స్ డ్యూటీనీ 10 శాతం నుంచి సున్నాకు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు బడ్జెట్ లో నిర్మల సీతారామన్ వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. రూ.90,958.63 కోట్ల నిధులను కేటాయించారు.
స్కానింగ్ చేయించుకుంటున్న రోగి
క్యాన్సర్ బారినపడి చికిత్స పొందుతున్న రోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్యాన్సర్ రోగులు వినియోగించే మందులకు సంబంధించి ఇప్పటి వరకు వసూలు చేస్తున్న కస్టమ్స్ డ్యూటీనీ 10 శాతం నుంచి సున్నాకు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు బడ్జెట్ లో నిర్మల సీతారామన్ వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. రూ.90,958.63 కోట్ల నిధులను కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.80,517.62 కోట్లతో పోలిస్తే ఇది 12.93% అధికం కావడం విశేషం. అలాగే, క్యాన్సర్ రోగులకు ఊరటను ఇచ్చేలా కీలకమైన మూడు ఔషధాలైన ట్రాస్టు జుమాబ్ డెరక్స్ టెకాస్, ఒసిమెర్టినిబ్, డర్వాలుమాబ్ పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి సున్నాకు తగ్గించారు. క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేందుకు వీలుగా మూడు రకాల క్యాన్సర్ అవసరాలపై కస్టమ్ సుంకాన్ని పూర్తిగా మినహాయిస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.
అలాగే ఎక్స్ రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్రే ట్యూబులు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై కస్టమ్ డ్యూటీలో కూడా మార్పులను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఆరోగ్య రంగానికి కేటాయించిన రూ.90,958.63 కోట్లలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.87,656.90 కోట్లు, ఆరోగ్య శాఖ పరిశోధనలకు రూ.3,301.73 కోట్ల కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ.3,712.49 కోట్లను కేటాయించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని పథకాలకు గతంలో ఉన్న రూ.77,624.79 కోట్లను.. ఈసారి రూ.87,656.90 కోట్లకు పెంచారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో నేషనల్ హెల్త్ మిషన్ కు రూ.31,550.87 కోట్లను.. ఈ ఏడాది రూ.36,000 కోట్లకు పెంచారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి కూడా కేటాయింపులు రూ.6800 కోట్ల నుంచి రూ.7,300 కోట్లకు పెంచారు. నేషనల్ టెలి మెంటల్ హెల్త్ కార్యక్రమానికి రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమానికి రూ.200 కోట్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు గత బడ్జెట్ లో కేటాయించిన రూ.17,250.90 కోట్లను రూ.18,013.62 కోట్లకు పెంచారు. ఇందులో ఢిల్లీలోని ఎయిమ్స్ కు రూ.4,523 కోట్లు కేటాయించారు.