అమెరికాలో ఉన్నత చదువులు చదవాలన్న యువత సంఖ్య దేశంలో అధికంగా ఉంటుంది. ఏటా లక్షలాదిమంది యువకులు అమెరికా వెళ్లి ఉన్నత చదువులు అభ్యసిస్తుంటారు. అయితే గడిచిన కొన్నాళ్లుగా అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికా వెళ్లాలని భావిస్తున్న యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వందలాది మందిని ఆదేశం యుద్ధ విమానాల్లో భారతదేశానికి పంపిస్తోంది. అదే సమయంలో అక్కడ పరిస్థితులు కూడా అధ్వానంగా ఉండడంతో అమెరికా వెళ్లాలి అని కలలు కన్నవారు కూడా కొద్ది రోజులు ఆగాలన్న ఆలోచనలోకి వెళుతున్నారు. ఇంజనీరింగ్ చేసిన ఎంతోమంది విద్యార్థులు ఎంఎస్ పేరిట అభిమానం ఎక్కేందుకు సిద్ధపడేవారు. వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపించేవారు.
ప్రతీకాత్మక చిత్రం
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలన్న యువత సంఖ్య దేశంలో అధికంగా ఉంటుంది. ఏటా లక్షలాదిమంది యువకులు అమెరికా వెళ్లి ఉన్నత చదువులు అభ్యసిస్తుంటారు. అయితే గడిచిన కొన్నాళ్లుగా అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికా వెళ్లాలని భావిస్తున్న యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వందలాది మందిని ఆదేశం యుద్ధ విమానాల్లో భారతదేశానికి పంపిస్తోంది. అదే సమయంలో అక్కడ పరిస్థితులు కూడా అధ్వానంగా ఉండడంతో అమెరికా వెళ్లాలి అని కలలు కన్నవారు కూడా కొద్ది రోజులు ఆగాలన్న ఆలోచనలోకి వెళుతున్నారు. ఇంజనీరింగ్ చేసిన ఎంతోమంది విద్యార్థులు ఎంఎస్ పేరిట అభిమానం ఎక్కేందుకు సిద్ధపడేవారు. వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపించేవారు. అయితే ఆ కళ చెదిరిపోతున్న సూచనలు క్రమంగా కనిపిస్తున్నాయి. రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి కారణం అవుతున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే హెచ్1బి వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు 4,79,953 కాగా, గడిచిన ఏడాదితో పోలిస్తే ఇది 38.6 శాతం తక్కువ. ఈ దరఖాస్తుల్లో భారత నుంచి వచ్చినవి గణనీయమైన సంఖ్యలో ఉంటాయి. వీటి సంఖ్య తగ్గింది అంటే భారత్ నుంచి తగ్గుదల భారీగా ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. భారత నుంచి ఎక్కువ వీసా అభ్యర్థులు వచ్చే నగరాల్లో హైదరాబాద్ టాప్ త్రీ లో ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఆ పరిస్థితి లేదు. హెచ్1 బి వీసాల కోసం పోటీ లేదంటున్నాయి పలు సంస్థలు. ఏదోరకంగా అమెరికాకు వెళ్లి నష్టపోవడం కంటే.. కొన్నాళ్లపాటు వేచి ఉండడం ఉత్తమం అన్న ఆలోచనలు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉంటున్నారు.
ఇతర దేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తుండడం కూడా మన విద్యార్థులను ఆలోచించేలా చేస్తున్నాయని పలువురూ పేర్కొంటున్నారు. డ్రాప్ బాక్స్ నిబంధనలో తీసుకువచ్చిన మార్పులు కూడా వీసాలు రెన్యువల్ చేసుకోవాలనే వారికి ఇబ్బందిగా మారాయి. కొత్త నిబంధనల ప్రకారం గడచిన 12 నెలల్లో గడువు ముగిసిన వేషాలు మాత్రమే పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఇస్తారు. ఈ వ్యవధి గతంలో 48 నెలలు ఉండేది. ఒక పాస్పోర్ట్ తో ఒక దరఖాస్తు మాత్రమే చేయాలని నిబంధన కూడా వీసా దరఖాస్తుల్లో తగ్గుదలకు కారణమని చెబుతున్నారు. గతంలో కంపెనీలు కూడా తమ ఉద్యోగులను రెండు మూడు ఏళ్ల అనుభవం ఉంటే హెచ్1 బీ వేసాయికి పంపించేవారు. ఇప్పుడు 10 ఏళ్ల అనుభవం ఉన్న వారి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే హెచ్1 బీ మాత్రమే కాదు ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అందులో మొదటిది ఎల్1 వీసా. బహుళ జాతి కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికాలోని తమ శాఖలకు బదిలీ చేసుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ విజిటర్స్ కు బీ1, పని ఆధారిత శిక్షణ, ఇంటర్ షిప్ టీచింగ్ కోసం జె 1, వ్యాపారవేత్తలకు ఈ1 వీసా మంజూరు చేస్తారు. అమెరికా వెళ్లాలి అనుకునేవారు ఈ ప్రత్యామ్నాయ వీసాలను వినియోగించుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.