తగ్గిన బంగారం అమ్మకాలు.. పెరిగిన ధరలే కారణమా.!

పసిడి ధర రోజురోజుకు పైకి ఎగబాకు తుండడంతో అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన కొద్దిరోజులుగా గణనీయంగా బంగారం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో పసిడి కొనాలనుకునే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో అమ్మకాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు ప్రస్తుత ధర చుక్కలు చూపిస్తోంది. గడిచిన ఏడాది పెళ్లిళ్ల సీజన్ తో పోలిస్తే నగల అమ్మకాలు ప్రస్తుతం 70 నుంచి 8 శాతం పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్ల కోసం బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావించారు. అయితే పెరిగిన ధరలు చూసి వాళ్లు వాయిదా వేసుకుంటున్నారు.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

పసిడి ధర రోజురోజుకు పైకి ఎగబాకు తుండడంతో అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన కొద్దిరోజులుగా గణనీయంగా బంగారం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో పసిడి కొనాలనుకునే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో అమ్మకాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు ప్రస్తుత ధర చుక్కలు చూపిస్తోంది. గడిచిన ఏడాది పెళ్లిళ్ల సీజన్ తో పోలిస్తే నగల అమ్మకాలు ప్రస్తుతం 70 నుంచి 8 శాతం పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్ల కోసం బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావించారు. అయితే పెరిగిన ధరలు చూసి వాళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ధర తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటున్నారు. దీంతో వివాహాల సీజన్ అయినప్పటికీ ధరలు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి విక్రయాలు గణనీయంగా పడిపోయినట్లు భారత బులియన్, జువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. 

ప్రస్తుత పరిస్థితికి అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని అంశాలు కారణం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కెనడా, మెక్సికో, ఈ యు వంటి మిత్ర దేశాలతో పాటు చైనా దిగుమతులపైన శుంకాలు పెంచేశారు. రేపో మాపో కొన్ని దేశాల దిగుమతులపై ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరించారు. దీంతో పెట్టుబడులకు ఢోకా లేని పసిడి ధర చుక్కలను అంటుతోంది. మరోవైపు దేశీయంగా రూపాయి పతనం కూడా పసిడి ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా ఉంది. మన దేశ పసిడి అవసరాల్లో 95 శాతానికి పైగా దిగుమతులే దిక్కు. బంగారం దిగుమతి చేసుకోవాలంటే డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే డాలర్ తో రూపాయి మారకం రేటు రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ పతనాన్ని అడ్డుకునేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు గత నాలుగు నెలల్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ డాలర్ తో రూపాయి పతనం ఆగలేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే మార్చి నెలాఖరకు డాలర్ తో రూపాయి మారకుం రేటు రూ.90కు దిగజారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో పసిడి పరుగులకు ఇది కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

10 శాతానికిపైగా పెరిగిన బంగారం ధరలు.. 

ఢిల్లీ మార్కెట్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 పెరిగి రూ.88,100 కు చేరింది. ఒక దశలో రూ.88,600 ను తాకింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లోను ఔన్స్ బంగారం ధర గురువారం ఒక దశలో రూ.2,944.60 డాలర్లకు (రూ.2,55,944) కు చేరింది. దేశీయంగా బంగారం ధర ఈ ఏడాది ఇప్పటికే 10 శాతానికి పైగా పెరిగింది. 2024లో పసిడి ధర 21 శాతానికి పైగా పెరిగిన సంగతి తెలిసిందే. 

సరఫరాకు మించిన డిమాండ్తో ఇబ్బంది..

అంతర్జాతీయంగా సైనిక ఉద్రిక్తతలు తగ్గిన ఆర్థిక అనిశ్ఛితి కొనసాగుతోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇది మరింత పెరిగింది. దీంతో భారత్, చైనా తోపాటు ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారం రిజర్వులు పెంచుకుంటూ వస్తున్నాయి. మరోవైపు మిగతా లోహాలతో పోలిస్తే పసిడి ఉత్పత్తి తక్కువ. డిమాండ్ అధికంగా ఉండడం ప్రస్తుత ఆర్థిక అనిశ్ఛితితో స్టాక్ మార్కెట్లో పడిపోతున్నాయి. దీంతో పెట్టుబడులకు పెద్దగా ఢోకాలేని పసిడి మళ్లీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్