ప్రకాశం బ్యారేజీకి చేరిన రికార్డు వరద.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వరద ముంచెత్తింది. సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 11,43,201 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలోకి 5,28,673 క్యూసెక్కుల నీరు వస్తుంటే 5,54,995 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ లోకి 4,68,595 క్యూసెక్కులు వరద వస్తుంటే.. కింద పులిచింతలకు 5,40,609 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు.

Heavy flood water in Prakasam barrage

ప్రకాశం బ్యారేజీ లో భారీ వరద నీరు

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వరద ముంచెత్తింది. సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 11,43,201 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలోకి 5,28,673 క్యూసెక్కుల నీరు వస్తుంటే 5,54,995 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ లోకి 4,68,595 క్యూసెక్కులు వరద వస్తుంటే.. కింద పులిచింతలకు 5,40,609 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. అక్కడ నుంచి వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల నుంచి వస్తున్న 5,43,433 క్యూసెక్కులతో పాటు సమీప వాగులు, కీసర, పాలేరు, బుడమేరు నుంచి భారీగా వస్తున్న వరదలతో కలిపి మొత్తం 11,43,201 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంతాలు మరో వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. వరద క్రమంగా తగ్గుముఖం పడుతోందని అయినప్పటికీ అపరమాతంగా ఉండాలని సూచించింది బ్యారేజీ వద్ద వరద మంగళవారం 9 లక్షల క్యూసెక్కులు ఉంటుందని అంచనా వేసింది వచ్చే వారం రోజుల్లో శ్రీశైలంలోకి 5,29,000 క్యూసెక్కులు, నాగార్జునసాగర్ లోకి 5,47,300 క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజీలోకి 10,76,800 క్యూసెక్కుల వరద రావచ్చని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్ట్స్ హెచ్చరించింది. ఐఎండి ఆలమట్టిలో 11,45,00 క్యూసెక్కులు, శ్రీశైలం జలాశయంలో 5,28,300 క్యూసెక్కులు, నాగార్జునసాగర్ లో 5,47,700 క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజీలో 10,78,800 క్యూసెక్కుల వరద వస్తుందని ఐఎండి పేర్కొంది. 

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద 

శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల నుంచి 3,20,805 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 4,479 క్యూసెక్కులు కలిపి మొత్తం 3,25,284 వరద నీరు వస్తోంది. డ్యామ్ 10 క్రస్ట్ గేట్లను ఎత్తి 4,71,730 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులుగా నమోదయింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.87 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 210.5133 టీఎంసీలుగా ఉంది. 26 గేట్లను ఎత్తి 5,40,656 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 586.80 అడుగులకు చేరింది. దిగువన పులిచింతలకు 5,43,070 క్యూసెక్కుల వరద వస్తుండగా, 5,43,433 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. అలాగే కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం గరిష్ట నిల్వకు చేరువవుతోంది. డ్యామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, సోమవారం ఉదయం 98.101 టిఎంసిలుగా ఉంది. జలాశయంలోకి 30,301 క్యూసెక్కుల వరద చేరుతోంది. అవుట్ ఫ్లో 15,237 క్యూసెక్కులుగా ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్