యూపీఐ తరహాలో రుణాల కోసం యుఎల్ఐ.. అందుబాటులోకి తీసుకురానున్న ఆర్బిఐ

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ పేస్ (యూపిఐ) మాదిరిగా సులభతర రుణాల కోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్(యూఎల్ఐ)ని పరిచయం చేయనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ ప్రకటన సరికొత్త రుణ మార్కెట్ ను సృష్టించనున్నట్లు తెలుస్తోంది. 2016లో డిజిటల్ చెల్లింపుల కోసం తీసుకువచ్చిన యూపీఐ విజయవంతం కావడంతో చిరు వ్యాపారులు, ఎంఎస్ఎమ్ఈలు, గ్రామీణులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రుణాలు తీసుకురావడానికి యుఎల్ఐని గత ఏడాది రెండు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా శక్తి కాంత దాస్ గుర్తు చేశారు.

UPI

యూపిఐ 

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ పేస్ (యూపిఐ) మాదిరిగా సులభతర రుణాల కోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్(యూఎల్ఐ)ని పరిచయం చేయనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ ప్రకటన సరికొత్త రుణ మార్కెట్ ను సృష్టించనున్నట్లు తెలుస్తోంది. 2016లో డిజిటల్ చెల్లింపుల కోసం తీసుకువచ్చిన యూపీఐ విజయవంతం కావడంతో చిరు వ్యాపారులు, ఎంఎస్ఎమ్ఈలు, గ్రామీణులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రుణాలు తీసుకురావడానికి యుఎల్ఐని గత ఏడాది రెండు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా శక్తి కాంత దాస్ గుర్తు చేశారు. ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా దీనిని అమలులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్బిఐ ఆవిర్భవించి 90 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో బెంగుళూరులో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశంపై ఏర్పాటు చేసిన గ్లోబల్ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ మాట్లాడారు. ఆర్బిఐ పరిధిలో పనిచేసే భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) ద్వారా యూపీఐను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. నగదు రహిత చెల్లింపులకు ఈ విధానం ఎంతగానో ఉపకరిస్తుందని స్పష్టం చేశారు. ఒక్క క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ ఐడి లేదా మొబైల్ నెంబర్ తో చెల్లింపులు చేసే వెసులుబాటును కల్పించిందని వివరించారు. ఆర్థిక సేవల డిజిటలీకరణను విజయవంతం చేసింది ఈ విధానమే. ఇదే స్ఫూర్తితో కేవలం ఒక్క సమ్మతితో గ్రామీణులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు రుణాలు తీసుకునేందుకు యుఎల్ఐ దోహదపడుతుందని శక్తికాంత దాస్ వెల్లడించారు. బహుల డేటా సర్వీస్ ప్రొవైడర్లు, రుణ దాతలు, వివిధ రాష్ట్రాల భూరి కార్డుల డిజిటల్ సమాచారంతో అనుసంధానమై ఉంటాయని వెల్లడించారు. క్రెడిట్ అర్హత మదింపు కోసం పట్టే సమయాన్ని యుఎల్ఐ తగ్గిస్తుందని, యూపీఐ మాదిరిగానే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) ఆధారంగా యుఎల్ఐ పనిచేస్తుందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

బ్యాంకింగ్, నాన్ నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు ఈ ఏపీఐ ఆధారంగా రుణాలను అందజేయవచ్చు. ఈ ఏపీఐ ద్వారా రుణాలు తీసుకునే వారి ఆర్థిక, ఆర్థికేతర డేటా ఒకే చోట లభ్యమవుతుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా యుఎల్ఐ అందుబాటులోకి వస్తే మరో డిజిటల్ విప్లవానికి నాంది పలికినట్లు అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రుణ యాప్లు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా అనేక రుణ యాప్ లు విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి ఉన్నాయి. ఈ రుణ యాప్ లో అప్పులు తీసుకుంటున్న ఎంతో మంది ఆ అప్పులను చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, యువత, ఉద్యోగస్తులు, మహిళలు ఉంటున్నారు. తీసుకున్న అప్పుకు రెండు, మూడు రెట్లు చెల్లిస్తేనేగాని ఆ సదరు యాప్ నిర్వాహకులు విడిచిపెట్టని పరిస్థితి. దీంతో లక్షలాది రూపాయలు చెల్లించలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ తరహా వ్యవహారాలకు కొత్తగా తీసుకురానున్న యుఎల్ఐ విధానంతో చెక్ పెట్టవచ్చని ఆర్బిఐ భావిస్తోంది. దీనిని వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు ఒకవైపు మేలు చేయడంతోపాటు రుణ యాప్ లు ద్వారా సాగిస్తున్న అరాచకాలకు చెక్ చెప్పే అవకాశం కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్