రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇకపై సన్న బియ్యం.. శుభవార్త చెప్పిన ప్రభుత్వం

రేషన్ కార్డు కలిగివున్న లబ్ధిదారులకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నార్థమవుతోంది. ఈనెల 30న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గడిచిన ఎన్నికల ప్రచారంలో భాగంగా సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉగాది రోజు సూర్యాపేటలోని మట్టపల్లి గుడి నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. అక్కడ పూజలు చేసి దైవానుగ్రహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

రేషన్ కార్డు కలిగివున్న లబ్ధిదారులకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నార్థమవుతోంది. ఈనెల 30న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గడిచిన ఎన్నికల ప్రచారంలో భాగంగా సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉగాది రోజు సూర్యాపేటలోని మట్టపల్లి గుడి నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. అక్కడ పూజలు చేసి దైవానుగ్రహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో దొడ్డిబియానికి బదులుగా సన్నబియ్యం ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాటులో చేస్తుంది. రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్య ప్రకారం ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు. దీని ద్వారా పేదలు మరింత నాణ్యమైన పౌష్టికాహారాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పోషకార లోపంతో అనేకమంది ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి వారి ఇబ్బందులను తొలగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోషకాలతో కూడిన సన్న బియ్యం అందించేందుకు సిద్ధమవుతోంది. ఇది నిరుపేదల ఆరోగ్యానికి మేలు చేకూర్చే నిర్ణయంగా పలువురు పేర్కొంటున్నారు. లబ్ధిదారులకు అందించేందుకు అనుగుణంగా అవసరమైన సన్న బియ్యాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సేకరించింది. వర్షాకాలం స్టేషన్ నుంచి సన్నధాన్యానికి తెలంగాణ సర్కార్ క్వింటా ధాన్యానికి 500 బోనస్ ఇస్తోంది. ఇలా వచ్చిన వడ్లను రైస్ మిల్లుల్లో మారాడించగా ఎనిమిది లక్షల టన్నుల సన్న బియ్యం వచ్చినట్లు సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు.

ఈ బియ్యాన్ని ఇప్పటికే జిల్లాలోనే స్టోరేజీ కేంద్రాల్లో నిలువ ఉంచారు. అక్కడ నుంచి మండల కేంద్రాల్లోని స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. ఆ తర్వాత రేషన్ దుకాణాలకు తరలించి అక్కడ నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. బిల్లులో మరాడిస్తున్న వడ్లతో వచ్చే సన్న బియ్యం మరో నాలుగు నెలల వరకు సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 91,19,268 రేషన్ కార్డులో ఉన్నాయి. ఇందులో లబ్ధిదారులు 2,82,77,859 మంది ఉన్నారు. వీరందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యాన్ని సరఫరా చేయనుంది. లబ్ధిదారుడికి నేలకి ఆరు కిలోలు చొప్పున సన్నబియ్యం ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అనుగుణంగా పౌరసరఫరాల శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకచోట్ల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు యాడాది దాటుతున్న ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పాటు ప్రతిపక్షం కూడా ఈ పథకం గురించి ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉగాది నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అనుగుణంగా రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాట్లు చేసింది. దీనివల్ల రాష్ట్రంలోని కోట్లాదిమంది లబ్ధిదారులకు మేలు చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్