పోలీసులకు దొరకని రామ్ గోపాల్ వర్మ.. బృందాలుగా గాలింపు

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే, ఆయన మాత్రం ఎవరికీ చిక్కడం లేదు. అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకపోవడంతో పోలీసులు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో బృందాలుగా విడిపోయి మరీ పోలీసులు ఆర్‌జీవీ కోసం గాలిస్తున్నారు. ఏపీలో రామ్‌గోపాల్‌ వర్మపై పలు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. గతంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌పై అసభ్యకర రీతిలో పోస్టింగ్‌లు చేశారంటూ పలువురు ఫిర్యాదులు చేశారు.

Director Ramgopal Varma

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే, ఆయన మాత్రం ఎవరికీ చిక్కడం లేదు. అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకపోవడంతో పోలీసులు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో బృందాలుగా విడిపోయి మరీ పోలీసులు ఆర్‌జీవీ కోసం గాలిస్తున్నారు. ఏపీలో రామ్‌గోపాల్‌ వర్మపై పలు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. గతంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌పై అసభ్యకర రీతిలో పోస్టింగ్‌లు చేశారంటూ పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై ఒంగోలు పోలీసులు రామ్‌గోపాల్‌ వర్మపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీసులు ఎదుట విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ పోలీసులు కొద్దిరోజులు కిందట నోటీసులు ఇచ్చిన సందర్భంగా పేర్కొన్నారు. అయితే, రామ్‌గోపాల్‌ వర్మ రాకపోవడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి స్టేషన్‌కు తీసుకురావాలని పోలీసులు భావించారు. అయితే, ఇంట్లో రామ్‌గోపాల్‌ వర్మ లేకపోవడంతో పోలీసులకు ఏం చేయాలో తెలియలేదు. వర్మ ఎక్కడకు వెళ్లిన విషయాన్ని ఇంట్లోని సిబ్బంది తెలియజేయలేదు. దీంతో వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోయంబత్తూరులోని లూసిఫర్‌-2 సినిమా షూట్‌లో రామ్‌గోపాల్‌ వర్మ బిజిగా ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లేందుకు సిద్ధడపతుఉన్నట్టు తెలిసింది. అక్కడకు ప్రత్యేక బృందాలను పోలీసులు పంపించారు. వారు చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, వర్మ ఇంకా కోయంబత్తూరులోనే ఉన్నారా..? లేక మరో ప్రాంతానికి వెళ్లిపోయారా..? అన్నది తెలియాల్సి ఉంది. 

రామ్‌గోపాల్‌ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల పదో తేదీన కేసు నమోదైంది. ఈ నెల తొమ్మిదో తేదీన వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌లు ఫొటోలు మార్పు చేసి మహిళలు ఫొటోలకు వీరి తలలు అంటించి అవమానకరంగా పోస్టింగ్‌లు పెట్టారని, వర్మపై చర్యలు తీసువాలని ఫిర్యాదు చేశారు. దీంతో నవంబరు పదో తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు 13న రామ్‌ గోపాల్‌ వర్మకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. నవంబరు 19న విచారణకు రావాలని పోలీసులు స్పష్టం చేశారు. నవంబరు 19న రాలేనని, వారం రోజులు గడువు కావాలని సీఐకి వాట్సాప్‌ మెసేజ్‌ ఇచ్చిన వర్మ.. ఒంగోలులోని తన లాయర్‌ ఎన్‌ శ్రీనివాసులు ద్వారా లిఖిత పూర్వక విజ్ఞప్తి చేశారు. దీంతో నంబరు 20న మళ్లీ రెండోసారి వర్మకు నోటీసులను పోలీసులు ఇచ్చారు. నవంబరు 25న ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని కోరారు. నవంబరు 25న విచారణఖు ఒంగోలుకు రాకుంటే అరెస్ట్‌ చేస్తామన్న సమాచారాన్ని ఇచ్చారు. వర్మ ఒంగోలుకు రాలేదన్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం వర్మ ఎక్కడున్నాడో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్