కూటమిలో రాజ్యసభ హీట్.. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు పలువురు యత్నం

ఈ మూడు స్థానాలకు కూటమిలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడు స్థానాల్లో రెండింటిని తీసుకోవాలని టిడిపికి భావిస్తుండగా, బిజెపి ఒక స్థానాన్ని కోరుతోంది. అయితే జనసేన కూడా తమకు ఒక స్థానాన్ని ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇదే తొలిసారి.

Galla Jayadev, Nagababu

 గల్లా జయదేవ్, నాగబాబు

ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వైసీపీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ పదవులకు కొద్ది రోజుల క్రిందట రాజీనామా చేశారు. ఈ స్థానాలకు కొద్ది రోజుల్లోనే ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో ఈ స్థానాలన్నీ కూటమికి దక్కనున్నాయి. ఈ మూడు స్థానాలకు కూటమిలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడు స్థానాల్లో రెండింటిని తీసుకోవాలని టిడిపికి భావిస్తుండగా, బిజెపి ఒక స్థానాన్ని కోరుతోంది. అయితే జనసేన కూడా తమకు ఒక స్థానాన్ని ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కనీసం రెండు స్థానాల్లో తమ ప్రాచీనిద్యం ఉండేలా టిడిపి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో ఒక స్థానాన్ని  రాజీనామా చేసిన బీద మస్తాన్ రావుకు కేటాయించాలని టిడిపి ఆలోచిస్తుంది. అయితే పోటీ అధికంగా ఉండడంతో మరి కొంతమంది పేర్లను కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టిడిపిలో రాజ్యసభ సీటు కోసం మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, టీడీ జనార్ధన్ రావుతోపాటు గడిచిన ఎన్నికల్లో సీట్లు దక్కని ఎంతోమంది నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు.

ఒకవైపు టిడిపిలో తీవ్రస్థాయిలో పోటీ నెలకొనగా.. ఒక స్థానాన్ని తమకు కేటాయించాలంటూ జనసేన, స్థానం కోసం బిజెపి పోటీపడుతున్నాయి. జనసేన కోరుతున్న సీటును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ తమకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించాలంటూ ప్రధాన మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షాను కూడా కోరినట్లు తెలుస్తోంది. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతున్న ఆయనకు సీటు కేటాయిస్తే తొలిసారి రాజ్యసభలో నాగబాబు అడుగుపెట్టినట్లు అవుతుందని చెబుతున్నారు. జనసేనకు ఒక సూచన కేటాయిస్తే మాత్రం నాగబాబు విజయం నల్లేరుపై నడకగానే చెప్పవచ్చు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వాళ్లు కూడా ఆ పార్టీలో పెద్దగా లేరు. ఆశావహులు లేరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జనసేనకు ఒక రాజ్యసభ సీట్లు కేటాయిస్తే మాత్రం నాగబాబు రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బిజెపి అగ్ర నాయకత్వం కూడా తమకు ఒక స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారని దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీకి సంబంధించిన మూడు స్థానాలు ఖాళీ కావడంతో ప్రస్తుతం కూటమికి చెందిన ఆశావహ నేతల్లో ఆనందం వ్యక్తం అవుతుండడంతో పాటు పోటీ కూడా తీవ్రస్థాయిలో నెలకొంది. మరి ఎవరికి ఈ స్థానాల్లో అవకాశం దొక్కుతుందో కొద్ది రోజుల్లో తేలనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్