జీఎస్టీవసూళ్లతో ప్రభుత్వానికి కాసుల వర్షం.. అక్టోబర్ లో భారీగా జీఎస్టీ వసూలు

ఏడాది జీఎస్టీ వసూళ్లు భారీగా వస్తున్నాయి. వరుసగా ఎనిమిదో నెల కూడా జీఎస్టీ వసూలు రికార్డు స్థాయిలో లభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూలు దూసుకెళ్లాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2.1 లక్షల కోట్ల జిఎస్టి వసూళ్లు కాగా, ఈ అక్టోబర్ నెలలో అంతకుమించి వసూళ్లు అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ నెలలో 1.87 లక్షల కోట్ల జిఎస్టి టాక్స్ లభించింది. గడిచిన ఆరు నెలల్లో వసూలు చేసిన జీఎస్టీ లో ఇదే అత్యధికం.

GST

జీఎస్టీ వసూళ్లు

ఏడాది జీఎస్టీ వసూళ్లు భారీగా వస్తున్నాయి. వరుసగా ఎనిమిదో నెల కూడా జీఎస్టీ వసూలు రికార్డు స్థాయిలో లభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూలు దూసుకెళ్లాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2.1 లక్షల కోట్ల జిఎస్టి వసూళ్లు కాగా, ఈ అక్టోబర్ నెలలో అంతకుమించి వసూళ్లు అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ నెలలో 1.87 లక్షల కోట్ల జిఎస్టి టాక్స్ లభించింది. గడిచిన ఆరు నెలల్లో వసూలు చేసిన జీఎస్టీ లో ఇదే అత్యధికం. గడిచిన ఎనిమిది నెలల నుంచి ప్రతినెల కనీసం 1.7 లక్షల కోట్ల జిఎస్టి వసూళ్లు వస్తున్నాయి. అక్టోబర్ నెలకి సంబంధించి జీఎస్టీ వసూళ్ళు 8.1 శాతం పెరిగింది. ఏడాది ఏప్రిల్ లో ఆల్ టైం రికార్డ్ స్థాయిలో 2.1 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలు అయ్యాయి. మళ్లీ అక్టోబరు నెలలో దాదాపు దానికి దగ్గరలో వసూలు లభించడంతో భారీగా ఆదాయం లభించినట్లు అయింది. రెండో త్రైమాస్కంలో జూలై - సెప్టెంబర్ మధ్య నెలవారి సగటు పన్ను వసూళ్లు 1.77 లక్షల కోట్లకు పడిపోయాయి. గడిచిన 8 నెలలుగా ప్రతినెల కనీసం 1.7 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు అవుతోంది. మళ్లీ అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూలు పెరిగింది. వచ్చే రెండు మూడు నెలలు వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పండగల నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఏడాది ఏప్రిల్ నెలలతో పోలిస్తే కాస్త తక్కువగానే జీఎస్టీ వసూళ్లు వచ్చినప్పటికీ.. మిగిలిన నెలలతో పోలిస్తే గణనీయంగానే జిఎస్టి వసూళ్ళు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

గడచిన ఆరు నెలలకు సంబంధించి వసూళ్లను పరిశీలిస్తే సుమారు 15 నుంచి 20 వేల కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు అదనంగా వచ్చాయి. ఏడాది ఏప్రిల్ తో పోలిస్తే 14 వేల కోట్లు తక్కువగా వచ్చినప్పటికీ మిగిలిన నేలలతో పోలిస్తే గరిష్టంగానే రాబడి లభించింది. వచ్చే రెండు నెలల్లో క్రిస్మస్ తోపాటు కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగకు సంబంధించిన వ్యాపారాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల మరింతగా జీఎస్టీ వసూళ్లు తిరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా జీఎస్టీ వసూలు భారీగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్