తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మండే ఎండల నుంచి ఉపశమనం.!

గడిచిన కొద్ది రోజులుగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. వాతావరణం రోజురోజుకు హీట్ పెంచుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలకు వర్షాలు పడనున్నాయన్న వార్త ప్రజలను ఆనందానికి గురిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలుకు పార్టీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వార్తతో రెండో తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ద్రోణి కారణంగా మరికొద్ది రోజులు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములు, పిడుగులతో కూడిన తేలుకు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

గడిచిన కొద్ది రోజులుగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. వాతావరణం రోజురోజుకు హీట్ పెంచుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలకు వర్షాలు పడనున్నాయన్న వార్త ప్రజలను ఆనందానికి గురిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలుకు పార్టీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వార్తతో రెండో తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ద్రోణి కారణంగా మరికొద్ది రోజులు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములు, పిడుగులతో కూడిన తేలుకు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ కేంద్రం వర్షాలు పడతాయి అన్న జారీ చేసింది. అదే సమయంలో రాగల రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. 

మధ్య చత్తీస్ఘడ్ నుండి అంతర్గత మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో సోమవారం తెలంగాణలో పొడువా వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత క్రమేపి రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతల పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. గరిష్టంగా ఆదిలాబాద్ లో 38.8 నుంచి కనిష్టంగా హైదరాబాదులో 33.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్నగర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలను మిగిల్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అకాల వర్షాలు కారణంగా వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల ప్రభావంతో మొక్కజొన్న పంట పూర్తిగా పాడయింది. మామిడి రైతుల కూడా తీవ్రంగా నష్టపోయారు. చేతికి అంది వచ్చిన పంట పాడవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. అటు ఏపీలోనూ అనేక జిల్లాల్లో అకాల వర్షం కారణంగా రైతులు పంట నష్టపోయారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో భారీగా అరట పంటకు నష్టం వాటిల్లింది. 2000 ఎకరాల్లోని పంట దెబ్బతిందని రైతులు తెలిపారు. కడప, అనంతపురం, సత్య సాయి, ప్రకాశం జిల్లాలోని పంట నష్టం సంభవించింది. ఏపీలోని అనేక జిల్లాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా వివది జిల్లాలో జరిగిన పంట నష్టం పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్