Train Ticket Problems | ఎంతో కష్టపడి టికెట్ బుక్ చేసుకున్నా, వేరే వాళ్లు వచ్చి మన సీట్లో కూర్చుంటారు. మన సొంత డబ్బులు పెట్టి.. మనం సీటు బుక్ చేసుకుంటే.. మన సీటు మనకే ఇవ్వకుండా దబాయిస్తుంటారు.
ప్రతీకాత్మక చిత్రం
రైలు ప్రయాణం అంటేనే పెద్ద ప్రయాసలా మారుతోంది. ఎంతో కష్టపడి టికెట్ బుక్ చేసుకున్నా, వేరే వాళ్లు వచ్చి మన సీట్లో కూర్చుంటారు. మన సొంత డబ్బులు పెట్టి.. మనం సీటు బుక్ చేసుకుంటే.. మన సీటు మనకే ఇవ్వకుండా దబాయిస్తుంటారు. అడ్జస్ట్ అయితే కూర్చో.. లేకపోతే వెళ్లి ఎక్కడైనా నిలబడు అని దురుసుగా మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు రైల్లో గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎదుటివాళ్లు మహిళలు అయితే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో పడిపోతుంటాం. టికెట్ కలెక్టర్ ఎప్పుడు వస్తాడా? ఆయనకు ఎప్పుడు ఫిర్యాదు చేద్దామా? అని వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే, అనేక రైళ్లలో ఇలాంటి సంఘటనలు పెరిగిపోతుండటంతో రైల్వే శాఖ రంగంలోకి దిగింది. మన సీట్లో వేరే వాళ్లు కూర్చుంటే వాళ్లను మర్యాదగా మెడ పట్టి గెంటేసే నిర్ణయం తీసుకుంది.
అయితే, మన సమస్యను రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లేందుకు 139 నంబర్ సహాయ పడుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. మన సీట్లో వేరే వాళ్లు కూర్చుంటే.. 139 నంబర్‌కు SEAT<space>PNR NUMBER<space>BOGI NUMBER<space>SEAT NUMBER<space>OCCUPIED BY UNKNOWN PERSON అని టైప్ చేసి పంపాలి. కొన్ని సందర్భాల్లో త్వరగా రిప్లై రాకపోతే.. 139 నంబర్‌కు కాల్ చేసి వివరాలు చెప్తే.. వచ్చే స్టేషన్‌లో రైల్వే పోలీసులు, టీసీ వచ్చి సీటును ఆక్రమించినవాళ్లను గెంటేస్తారు.
గమనిక : ఎంతో మందికి అవసరమైన సమాచారం. పలువురికి షేర్ చేయండి.