తెలంగాణ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. రైతులకు బేడీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేస్తున్నారు. సమావేశాలు ప్రారంభం కాగానే సభలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. నల్ల దుస్తులు, బేడీలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లగచర్ల రైతులకు మద్దతుగా ప్రత్యేక రీతిలో నిరసనను తెలియజేశారు. రైతులను అవమానించేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు.

BRS MLAs in black dresses and bedis

నల్ల దుస్తులు, బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేస్తున్నారు. సమావేశాలు ప్రారంభం కాగానే సభలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రైతులకు బేడీలు వేసిన ఘటనపై నిరసనను తెలియజేశారు. రైతులను అవమానించేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన స్పీకర్ మీరంతా సీనియర్ ఎమ్మెల్యేలు సభకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయనప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరు పట్ల తమ నిరసనను తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. నల్ల దుస్తులు, బేడీలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లగచర్ల రైతులకు మద్దతుగా ప్రత్యేక రీతిలో నిరసనను తెలియజేశారు. 

మరోవైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు తెలియజేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. గడిచిన కొన్నాళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల బీఆర్ఎస్ నేతలు ఈ సమావేశాలు వేదికగా తూర్పారబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలను కెసిఆర్ చేసినట్లు చెబుతున్నారు. కేటీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ సభలోను దీనిపై గట్టిగానే మాట్లాడే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఏది ఏమైనా మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్