పుతిన్, ట్రంప్ కీలక భేటీ నేడే.. కీలక నిర్ణయాలకు అవకాశం.!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం భేటీ కానున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా గడిచిన నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఈ సమావేశంలో ముగింపు పలికేలా కీలక నిర్ణయం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపు అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అటు రష్యా, ఇటు అమెరికా కూడా ధ్రువీకరించాయి. ఇప్పటికే ఒకసారి ట్రంప్.. రష్యా అధ్యక్షుడితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

Trump, Puthin

ట్రంప్, పుతిన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం భేటీ కానున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా గడిచిన నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఈ సమావేశంలో ముగింపు పలికేలా కీలక నిర్ణయం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపు అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అటు రష్యా, ఇటు అమెరికా కూడా ధ్రువీకరించాయి. ఇప్పటికే ఒకసారి ట్రంప్.. రష్యా అధ్యక్షుడితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అప్పట్లో అసంపూర్తిగా చర్చలు ముగిశాయి. దీంతో తాజాగా మరోసారి పుతిన్ తో ఫోన్లో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. యుద్ధం ముగింపునకు సంబంధించి తమకు బలమైన హామీలు ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తుంది. రష్యా నాటో ప్రభుత్వం నుంచి ఉక్రెయిన్ మినహాయించాలని పట్టుబడుతోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని కోరుతోంది. వాస్తవానికి అమెరికా ఇరుదేశాలకు 30 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించింది. దీనికి ఉక్రేన్ అధ్యక్షుడు జేలన్స్కి అంగీకరించారు. రష్యా అధినేత పుట్టిన మాత్రం మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి విరామం ఇచ్చేందుకు కీలకమైన షరతులను  నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. 

అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత..

ప్రపంచంలోనే అగ్రదేశాలుగా పేరుగాంచిన అమెరికా, రష్యా అధినేతలు సమావేశం అవుతుండడంతో అంతర్జాతీయంగా ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. బయటకు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశాలపై చర్చకు ఇద్దరు నేతలు సమావేశం అవుతున్నట్లు చెబుతున్నారు. కానీ అంతర్గతంగా మరికొన్ని కీలక అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరుదేశాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తీసుకోవాల్సిన కీలక నిర్ణయాల పైన చర్చలు జరిగే అవకాశం ఉంది. గడిచిన కొన్నాళ్లుగా అమెరికా, రష్యా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దీనికి అంతర్జాతీయంగా నెలకొన్న అనేక అంశాలు కారణమవుతున్నాయి. వీటినే పరిష్కరించుకోవడం పైన ఈ ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్