పుష్ప-2 మెగా అభిమానులు ట్రోలింగ్‌.. ప్లాప్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 సినిమా వరల్డ్‌ వైడ్‌గా విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. తొలిరోజే రికార్డు కలెక్షన్స్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మరో చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఒకవైపు ఈ చిత్రం రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంటే.. మరోవైపు మెగా కాంపౌండ్‌లో ఈ చిత్రం మరింత ఆజ్యం పోసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మెగా ఫ్యామిలీ వర్సెస్‌ అల్లు అర్జున్‌ అన్నట్టుగా వార్‌ నడుస్తోంది. మెగా అభిమానులు, అల్లు అర్జున్‌ అభిమానులు విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 సినిమా వరల్డ్‌ వైడ్‌గా విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. తొలిరోజే రికార్డు కలెక్షన్స్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మరో చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఒకవైపు ఈ చిత్రం రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంటే.. మరోవైపు మెగా కాంపౌండ్‌లో ఈ చిత్రం మరింత ఆజ్యం పోసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మెగా ఫ్యామిలీ వర్సెస్‌ అల్లు అర్జున్‌ అన్నట్టుగా వార్‌ నడుస్తోంది. మెగా అభిమానులు, అల్లు అర్జున్‌ అభిమానులు విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో నంద్యాల ఎమ్మెల్యేగా పోటి చేసిన శిల్పా రవికి మద్ధతుగా ప్రచారం చేసేందుకు వెళ్లినప్పటి నుంచి వీరి మధ్య వార్‌ నడుస్తోంది. తాజాగా పుష్ప-2 సినిమా రిలీజ్‌ సందర్భంగా ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో మెగా కుటుంబానికి చెందిన అగ్ర నాయకులు ఎవరూ విషెష్‌ చేయలేదు. దీనిపై కనీసం మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ తేజ్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి వాళ్లు స్పందించలేదు. అల్లు అర్జున్‌ కూడా సినిమా విడుదల నేపథ్యంలో వారిని కలువలేదు. దీంతో వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరినట్టు అందరికీ అర్థమైంది.

ఈ నేపథ్యంలో వీరి అభిమానులు కూడా సామాజిక మాధ్యమాలు వేదికగా వార్‌ను మరింత ముందుకు తీసుకెళుతున్నారు. సినిమా విడుదలకు ముందు నుంచే పవన్‌ కల్యాణ్‌, ఇతర మెగా అభిమానులు అల్లు అర్జున్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్స్‌ చేస్తున్నారు. చిరంజీవి వల్ల పైకి వచ్చిన అల్లు అర్జున ఇప్పుడు తానే అంతా అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని, ఇదంతా కిందకు దిగుతుందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు పుష్ప-2 అట్లర్‌ ప్లాప్‌ అంటూ రివ్యూలు ఇస్తుండగా, కొందరు అదే పనిగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మేం సినిమా చూడం బ్రదర్‌ అంటూ వ్యాఖ్యానిస్తుండగా, ఇంకొందరు అయితే పుష్ప-2 సినిమాను బాయ్‌ కాట్‌ చేస్తున్నామంటూ పేర్కొంటున్నారు. ఈ కామెంట్లు, ట్రోలింగ్స్‌పై అల్లు అర్జున్‌ అభిమానులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఎంత ట్రై చేసుకన్నా తగ్గేదేలా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే సినిమా రికార్డుల మోత మోగిస్తోందని, ఎవరో చూడకపోయినంత మాత్రాన తమకు వచ్చే నష్టం ఏమీ లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వివాదాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు వైసీపీ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక థియేటర్ల వద్ద అల్లు అర్జున్‌ అభిమానులతోపాటు వైసీపీ నాయకులు, జగన్‌ అభిమానులు కూడా ప్లెక్సిలు పెట్టడం గమనార్హం. ఏది ఏమైనా అల్లు అర్జున్‌ పుష్ప-2 సినిమా మాత్రం ఈ వివాదాలతో అనుకున్న దానికంటే ఎక్కువ హైప్‌ను సాధించి భారీ వసూళ్లతో ముందుకు సాగుతోంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్