ఒడిశా లోని పూరీ జగన్నాథుడి శ్రీ క్షేత్ర రత్న బాండాగరాన్ని 46 ఏళ్ల తర్వాత తెరవబోతున్నారు. జగన్నాధుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్ర పెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. వీటిని తెరిచేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఈ భాండాగారాన్ని అప్పుడప్పుడు తెరిచి సంపద లెక్కించేవారు. అయితే, 1978 తరువాత దీనిని ఇప్పటి వరకు తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై వివాదాలు ఎన్నో నెలకొన్నాయి.
జస్టిస్ బిశ్వనాథ్ రథ్
ఒడిశా లోని పూరీ జగన్నాథుడి శ్రీ క్షేత్ర రత్న బాండాగరాన్ని 46 ఏళ్ల తర్వాత తెరవబోతున్నారు. జగన్నాధుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్ర పెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. వీటిని తెరిచేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఈ భాండాగారాన్ని అప్పుడప్పుడు తెరిచి సంపద లెక్కించేవారు. అయితే, 1978 తరువాత దీనిని ఇప్పటి వరకు తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై వివాదాలు ఎన్నో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒడిశాలో కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం ఈ భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీన భాండాగారాన్ని తెరిచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 40 ఏళ్ల తర్వాత ఈ భాండాగారాన్ని తెరుస్తున్నట్లు అవుతోంది. ఆభరణాల లెక్కింపుతోపాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేయనున్నారు. భాండాగారాన్ని తెరిచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సమావేశం మంగళవారం పూరీలో జరిగింది. 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. భాండాగారం తెరవడంతోపాటు సంపద లెక్కింపు ఆభరణాల భద్రత మరమ్మత్తులపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. రథయాత్ర పని భారం వల్ల శ్రీక్షేత్ర పాలనాధికారి భాండాగారం డూప్లికేట్ తాళపు చెవిని కలెక్టరేట్లోనే ట్రెజరీ నుంచి తీసుకురాలేదని, ఆయన 14న తమకు అందజేస్తారన్నారు. దీంతో తెరుచుకోకపోతే తాళం కప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు వెల్లడించారు.
పూరి జగన్నాధుడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు ఇప్పటి వరకు వజ్రా వైడూర్యాలు, గోమేధిక, పుష్య రాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణా భరణాలు, వెండి తదితరాల బరువు నాణ్యతను పరిశీలించనున్నారు. ఇందుకు నిపుణుల అవసరం ఉంటుందని, తాము పర్యవేక్షణ మాత్రమే చేస్తామని రథ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథుని ఆభరణాలను ఐదు కర్ర పెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా 70 రోజులు సమయం పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీని సమర్థించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరి వర్షపునీరు లీకై గోడలు బీటలు వాలుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018 లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్ 6 నాటి నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా రహస్యగది తాళపు చెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్లీ ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం 16 మందితో కమిటీ వేసింది. ఈ కమిటీ కూడా తలుపులు తెరిచేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న తాళపు గదితో తలుపులు రాకపోయినట్లయితే.. దాన్ని పగలగొట్టేందుకు కూడా ఈ కమిటీ సిద్ధమవుతోంది. దీంతో 46 ఏళ్లుగా తెరుచుకోని ఈ భాండాగారం కొద్దిరోజుల్లోనే తెరుచుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూరీ జగన్నాథుడి భక్తులు ఈ ప్రక్రియ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.