పదేళ్ల బిఆర్ఎస్ పాలన పాపాలతో శిక్ష.. అసెంబ్లీలో విమర్శించిన రేవంత్ రెడ్డి

తెలంగాణలోని ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చపై ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ ప్రతిపక్ష నాయకుల వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మరోసారి సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పదేళ్ల భారతీయ రాష్ట్ర సమితి పాలనలో చేసిన పాపాలను చదవడం తనకు శిక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు.

CM Revanth Reddy

 సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చపై ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ ప్రతిపక్ష నాయకుల వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మరోసారి సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పదేళ్ల భారతీయ రాష్ట్ర సమితి పాలనలో చేసిన పాపాలను చదవడం తనకు శిక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. అన్ని పార్టీలు, ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలను తీసుకుని రైతు భరోసా పథకా విధివిధానాలు రూపొందించాలని ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. విధి విధానాలను రూపొందించి రైతు భరోసా మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో వ్యవసాయం చేసే వారికి పెట్టుబడి సహాయం అని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్లే అర్హులకు ఆశించిన ఆశించినంత స్థాయిలో లాభం చేకూరలేదన్నారు. సాగు చేయని భూములకు రూ.22,606 కోట్లు రైతుబంధు ద్వారా అందిందన్నారు.

లేఅవుట్లకు, రాజీవ్ రహదారి భూములకు, శ్రీశైలం హైవే, క్రషర్లు, మైనింగ్ భూములకు రైతుబంధు సహాయం అందించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతుబంధు సహాయం పొందారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పెద్దల అనుచరులు, బంధువుల పేర్లతో వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారని ఆరోపించారు. భారతీయ రాష్ట్ర సమితి చిత్ర విచిత్ర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో ఈ సూచనలు చెప్పండి అన్నారు. అబద్ధాల సంఘం అధ్యక్షుడు సభకు రాలేదని, ఉపాధ్యక్షుడు సభకు వచ్చి రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే సహించేది లేదని, సహేతుకమైన సూచనలు చేస్తే పరిగణలోకి తీసుకుంటామన్నారు. రైతు ఆత్మహత్యలు పెరుగుతుండడం దారుణం అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని పేర్కొన్నారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, ఈ విషయంలో తప్పుడు ప్రచారం తగదన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్