గుండె జబ్బులకు ముందే పుల్ స్టాప్.. 30 ఏళ్ల ముందుగానే గుండె జబ్బులు గుర్తించే పరిశోధన

గత కొన్నాళ్లుగా ఎక్కడ చూసినా గుండె జబ్బులు గురించి చర్చ సాగుతూనే ఉంది. 20 ఏళ్ల యువకుడు నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుడి వరకు ఎంతో మంది గుండె జబ్బుల బారిన పడి ఆకస్మాత్తుగా ప్రాణాలను కోల్పోతున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన ఎంతో మంది ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్ప కూలిపోతున్నారు. భోజనం చేస్తుండగానే కుప్పకూలిపోయిన ఎంతోమంది వీడియోలు ఈ మధ్యకాలంలో చూశాం. వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారిని మనం గమనించాం.

Heart attack

గుండె పోటు

గత కొన్నాళ్లుగా ఎక్కడ చూసినా గుండె జబ్బులు గురించి చర్చ సాగుతూనే ఉంది. 20 ఏళ్ల యువకుడు నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుడి వరకు ఎంతో మంది గుండె జబ్బుల బారిన పడి ఆకస్మాత్తుగా ప్రాణాలను కోల్పోతున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన ఎంతో మంది ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్ప కూలిపోతున్నారు. భోజనం చేస్తుండగానే కుప్పకూలిపోయిన ఎంతోమంది వీడియోలు ఈ మధ్యకాలంలో చూశాం. వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారిని మనం గమనించాం. అయితే ఈ తరహా గుండెపోటులను కొన్ని రకాల పరీక్షలు నిర్వహించడం ద్వారా ముందస్తుగానే గుర్తించే అవకాశం ఉందని తాజాగా ఒక పరిశోధన వెల్లడించింది. సాధారణంగా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి గుండె జబ్బు ప్రమాదాన్ని అంచనా వేస్తుంటారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పై దృష్టి పెడతారు. అయితే, రక్త పరీక్షను కొలెస్ట్రాల్ మోతాదులు చూడటానికి పరిమితం చేయటం వల్ల గుండెజబ్బు ప్రమాదాన్ని సూచించే ఇతర కారకాల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు అయిందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఎల్డీఎల్ తోపాటు రక్తంలో ఉండే లిపో ప్రోటీన్ అనే కొవ్వు గురించి, మంట పుట్టించే రియాక్టివ్ ప్రోటీన్ల గురించి తెలుసుకోవడం ద్వారా 30 ఏళ్ల  వ్యవధిలో వచ్చే గుండె జబ్బులను కూడా ముందుగానే తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టవచ్చు అని ఈ అధ్యయనం తెలియజేసింది.

న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో దీని వివరాలు ప్రచురితమయ్యాయి అమెరికాలోని సెంటర్ ఫర్ కార్డియో వాస్కులరీ డిసీజ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ పాల్ రిడ్కర్ సారధ్యంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన జరిపింది. దీనిలో భాగంగా విమెన్స్ హెల్త్ స్టడీలో భాగమైన దాదాపు 30 వేల మంది అమెరికా మహిళల ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. 1992 - 95 మధ్య జరిగిన ఈ స్టడీలో చేరినప్పుడు ఈ మహిళల సగటు వయసు 55 ఏళ్లు. ఆ తరువాత 30 ఏళ్లలో వీరిలో దాదాపు 13 శాతం మంది (3600 మంది) గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. స్టడీలో బాగం కావడానికి మహిళలందరికీ అప్పట్లో రక్త పరీక్షలు జరిపారు. ప్రస్తుతం పాల్ రిడ్కర్ బృందం ఈ రక్త పరీక్ష ఫలితాలను అధ్యయనం చేసి గత 30 ఏళ్లలో ఆ మహిళలు ఎదుర్కొన్న గుండె జబ్బులకు, వారి రక్త పరీక్ష ఫలితాలకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించింది. దీని ప్రకారం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న వారితో పోలిస్తే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అత్యధిక స్థాయిలో ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 36% అధికంగా ఉన్నట్లు తెలిసింది. ఇదే విధంగా లిపో ప్రోటీన్ (ఎల్పి-ఏ) ఎక్కువగా ఉన్నవారిలో ఈ ప్రమాదం 33% ఎక్కువ. సి రియాక్టివ్ ప్రోటీన్లు (సిఆర్పి) అత్యధికంగా ఉన్నవారిలో గుండు జబ్బులు ప్రమాదం 70 శాతం ఎక్కువని వెల్లడించింది.  ఇక మీదట రక్త పరీక్షలో ఎల్డీఎల్ తోపాటు, లిపో ప్రోటీన్, సి రియాక్టివ్ ప్రోటీన్లు మోతాదు కూడా తప్పకుండా పరిశీలించాలని, తద్వారా గుండె జబ్బులు ప్రమాదాన్ని ముందే తెలుసుకోవచ్చని డాక్టర్ పాల్ రిడ్కర్ సూచించారు. లండన్ లో జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ 2024 లో ఈ పరిశోధన పత్రాన్ని ఆయన సమర్పించారు. ప్రస్తుతం ఈ పరిశోధన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గుండె జబ్బుల మరణాలను నియంత్రించేందుకు ఈ పరిశోధన కీలకంగా మారనుందని పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్