నేడు విశాఖలో ప్రధాని భారీ బహిరంగ సభ.. రెండు లక్షల కోట్ల భారీ ప్రాజెక్టులకు శ్రీకారం

ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. సుమారు రెండు లక్షల కోట్లకుపైగా విలువైన కీలక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. విశాఖ నగర పరిధిలోని ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే ఆయన ఈ కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. అంతకుముందు ఆయన రోడ్ షో నిర్వహించి ఈ వేదికకు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leaders examining the assembly arrangements

సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న నాయకులు

ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. సుమారు రెండు లక్షల కోట్లకుపైగా విలువైన కీలక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. విశాఖ నగర పరిధిలోని ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే ఆయన ఈ కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. అంతకుముందు ఆయన రోడ్ షో నిర్వహించి ఈ వేదికకు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గడిచిన పది రోజులుగా ఈ సభను విజయవంతం చేయడంపై కూటమి నాయకులు దృష్టి సారించారు. సుమారు మూడు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని మూడు పార్టీల నాయకులు చెబుతున్నారు. ఈ సభా వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక లో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు శ్రీకారం చుట్టనున్నారు. దీని విలువ రూ.1.85 లక్షల కోట్లు, రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేలకోట్లుగా చెప్తున్నారు. వీటితోపాటు మరో 10కిపైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా నిర్మించిన, విస్తరించిన ఆరు రహదారులు, రైల్వే లైన్లను జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. దీంతో సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కూటమి పార్టీలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. 

శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులు ఇవే 

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ సభా వేదికగా 12 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకుపైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనులు విలువ దాదాపు రెండు లక్షల కోట్లు. సభా వేదికపై కూటమి నాయకులు అందరూ కనిపించనున్నారు. ప్రధాని శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఉంది. అలాగే, కృష్ణపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్ రోడ్డు, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన, ఆదోని పట్టణం నుంచి ఎన్ హెచ్-167ను కలుపుతూ బైపాస్ రహదారి, కొండమోరు నుంచి పేరేచర్ల రహదారి విస్తరణ, సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు వరకు రహదారి విస్తరణ, వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు ఎన్హెచ్-440 విస్తరణ, ఎన్హెచ్ 516 నుంచి పాడేరు బైపాస్ రహదారి నిర్మాణం, గుంటూరు నుంచి బీబీనగర్ వరకు రైల్వే లైన్ డబ్బింగ్ మహబూబ్నగర్ నుంచి కర్నూలు మీదుగా డోన్ రైల్వే లైన్ డబ్లింగ్, గుత్తి - పెండేకల్లు రైల్వే డబ్లింగ్, రూ.19,500 కోట్ల విలువైన రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఇంకా ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు భాగ్య రేఖ అయిన క్రిస్ సిటీ (కృష్ణపట్నం - ఇండస్ట్రియల్ సిటీ) ను ఏర్పాటు చేయనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్