భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రతిపాదిత బెల్ట్ అండ్ రోడ్డు ఇనిసియేటివ్ (బిఆర్ఐ) అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రధాని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాల గళం పేరుతో నిర్వహిస్తున్న సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చైనా బిఆర్ఐ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అతిపెద్ద ముప్పుగా పరిమించాయని, వీటి నుంచి మన సమాజాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని పిలుపునిచ్చారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రతిపాదిత బెల్ట్ అండ్ రోడ్డు ఇనిసియేటివ్ (బిఆర్ఐ) అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రధాని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాల గళం పేరుతో నిర్వహిస్తున్న సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చైనా బిఆర్ఐ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అతిపెద్ద ముప్పుగా పరిమించాయని, వీటి నుంచి మన సమాజాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని పిలుపునిచ్చారు. గ్లోబల్ సౌత్ దేశాలకు పరస్పర వాణిజ్యం, సమ్మిళిత వృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఈ దేశాలు ఐక్యంగా ఉండడం ద్వారా ఆరోగ్య, ఆహార, ఇంధన భద్రత విషయంలో తలెత్తుతున్న సవాళ్లను అధిగమించేందుకు అవకాశం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ (డిపిఐ) వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన సామాజిక ప్రభావ నిధికి ప్రాథమికంగా 25 మిలియన్ డాలర్ల (దాదాపు 200 కోట్లు) సహకారాన్ని ప్రకటించారు. ఇతర దేశాలతో అభివృద్ధి భాగస్వామ్యం పంచుకునేందుకు భారతదేశ సొంత అభివృద్ధి అనుభవాల ఆధారంగా గ్లోబల్ డెవలప్మెంట్ కంపాక్ట్ (జిడిసి)ని ప్రధాని ప్రతిపాదించారు. ఇది గ్లోబల్ సౌత్ దేశాలు ప్రతిపాదించిన అభివృద్ధి ప్రాధాన్యాలపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్న దేశాలకు కూడా గ్లోబల్ డెవలప్మెంట్ కంపాక్ట్ ఎలాంటి భారం మోపదని తెలిపారు. భాగస్వామ్య దేశాలకు సుస్థిరాభివృద్ధిలో సహకారం అందిస్తుందని వెల్లడించారు. చైనా ప్రతిపాదిత బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్ (బిఆర్ఐ)ను ప్రధాన మోడీ తీవ్రస్థాయిలో ఈ సందర్భంగా విమర్శించారు. దీనివల్ల నిలకడలేని ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోందని స్పష్టం చేశారు. బిఆర్ఐకు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ డెవలప్మెంట్ కంపాక్ట్ ను అందిపించుకోవాలన్నారు. దీనివల్ల వాణిజ్యం వృద్ధి చెందుతుందని, సుస్థిరాభివృద్ధిలో సామర్ధ్య నిర్మాణం పెరుగుతుందని, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవచ్చని, ప్రాజెక్టుల కోసం రాయితీ రుణాలు, గ్రాంట్లను పొందే అవకాశం ఉంటుందని వివరించారు. వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు రూ.21 కోట్లతో ప్రత్యేక నిధి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య విధానాలపై శిక్షణకు ఎనిమిది కోట్లతో మరో నిధిని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
సవాళ్లపై అప్రమత్తత అవసరం..
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఎన్నో సవాళ్ళపై ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదాలు సమాజానికి తీవ్ర సవాల్ గా పరిణమించాయని వెల్లడించారు. సాంకేతికత కారణంగా తలెత్తుతున్న సామాజిక సవాళ్లు పుట్టుకొస్తున్నాయన్నారు. గత శతాబ్దపు పాలనా సంస్థలు, ఈ శతాబ్దపు సవాళ్ళతో పోరాడలేకపోతున్నాయని వివరించారు. 2022లో జీ20ట సదస్సుకు నేతృత్వం వహించిన భారత్ గ్లోబల్ సౌత్ గళాన్ని వినిపించే వేదికను సృష్టించిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.