కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం.. నోటీసులు ఇచ్చేందుకు జోరుగా ఏర్పాట్లు.!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టుకు సంబంధించి గవర్నర్ అనుమతిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఫార్ములా ఈ - కారు రేసు వ్యవహారం పూర్తిస్థాయిలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.

ktr

కేటీఆర్ 

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టుకు సంబంధించి గవర్నర్ అనుమతిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఫార్ములా ఈ - కారు రేసు వ్యవహారం పూర్తిస్థాయిలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ అంశంలో చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. ఏసీబీ విచారణకు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం కేటీఆర్ కు నోటీసులు ఏసీబీ అధికారులు జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు క్యాబినెట్ లో మంత్రుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. కేటీఆర్ పై విచారణకు సంబంధించి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, ఈ విషయంలో జాప్యం జరిగితే ఉపయోగం ఉండదని మెజారిటీ మంత్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

దీంతో ఫార్ములా వన్ ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతిస్తూ గవర్నర్ పంపిన పత్రాలను సీఎస్ కు పంపించాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీకి పంపించనున్నారు. ఏసీబీ దర్యాప్తులో భాగంగా తొలుత ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నాయకుడిగా కేటీఆర్ ప్రజల్లో గుర్తింపు పొందుతున్నారు. కేటీఆర్ లాంటి నేతను అరెస్టు చేయాలంటే దూకుడుగా వెళ్లకూడదని,  న్యాయ పరమైన చిక్కులు రాకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని మంత్రులు సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. పూర్తిస్థాయి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం వల్ల రాజకీయ కక్ష సాధింపు అనుకునే అవకాశం ఉందన్న విషయంపైనా ప్రభుత్వం పెద్దలు ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాజకీయంగా ఈ అంశం సున్నితమైనది కావడంతో ప్రభుత్వ పెద్దలు కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కేటీఆర్ అవినీతిపై ప్రజల్లో వీలైనంతగా చర్చ జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసే అవకాశం ఉంది. ప్రజల్లో పూర్తిస్థాయిలో దీనిపై ఒక అవగాహన వచ్చిన తరువాత కేటీఆర్ ను అరెస్టు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందన్న భావనను ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా విచారణ ప్రక్రియ జరిగేలా ఏసీబీకి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు.

ఇకపోతే బిఆర్ఎస్ కూడా కేటీఆర్ ను అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుంది. కేటీఆర్ ప్రజా గొంతుకై ప్రభుత్వంపై పోరాడుతున్న నేపథ్యంలోనే అరెస్టు చేస్తోందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. బిఆర్ఎస్ ను కేటీఆర్, హరీష్ రావు ముందుండి నడిపిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వాయిస్ ను కేటీఆర్ గట్టిగా వినిపిస్తున్నారు. అటువంటి కేటీఆర్ ను అరెస్టు చేయడం అంటే ఒక రకంగా బీఆర్ఎస్ గొంతు నొక్కి ప్రయత్నం చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అదే జరిగితే కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత కెసిఆర్ బహిరంగంగా బయటకు వచ్చి నిరసన తెలియజేసే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని పలువురు రాజకీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కేసీఆర్ కూడా యాక్టివ్ గా రాజకీయాలను సాగించే అవకాశాలను కొట్టి పారేయలేమని చెబుతున్నారు. కెసిఆర్ గనుక రోడ్లమీదకు వచ్చి సమావేశాలు నిర్వహించే పరిస్థితి ఏర్పడితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి కేటీఆర్ అరెస్టుకు సంబంధించి ప్రభుత్వం ఎంతవరకు దూకుడుగా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది. 

జైపూర్ లో ఆదానితో డిన్నర్ రిజల్ట్ : కేటీఆర్ 

కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై ట్విట్టర్ వేదికగా మంగళవారం తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బీజేపీతో ఢిల్లీలో చిట్టి గారి కాళ్ళ బేరాలు, జైపూర్ లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుందని పేర్కొన్నారు. 30 సార్లు ఢిల్లీకి పోయిన మూడు పైసలు తేలేదని,  మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే మీ ఖర్మ అంటూ విమర్శించారు కేటీఆర్. 

స్వామిభక్తికి, బానిసత్వానికి పరాకాష్ట.. టీడీపీ పీఎస్సీనా : కేటీఆర్

టీజీపీఎస్సీపైన కేటీఆర్ కీలక పోస్ట్ చేశారు. తెలంగాణలో అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీతో, మహాకూటమి పేరుతో 2009లో జతకట్టినట్లే కట్టి, అధికారం గ్యారంటీ అన్న పచ్చ మీడియా వాదనతో మిత్రపక్షాలకు వదిలిన సీట్లలో బీఫారాలు ఇచ్చిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు కేటీఆర్. 2008లో అధికారం కోసం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, 2009 డిసెంబర్ 9న కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాగానే వచ్చిన తెలంగాణకు ద్రోహం చేసి మూకుమ్మడి రాజీనామాలను ముందుండి నడిపించింది చంద్రబాబు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2009 జూన్ 23న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెనక్కి తీసుకోవడానికి కారకుడు చంద్రబాబు అని, 2009 నుండి 2014 జూన్ 2 వరకు తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు, ఆత్మహత్యలకు కారణం చంద్రబాబు అని కేటీఆర్ విమర్శించారు. వచ్చిన తెలంగాణను, కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను తెర్లు చేయాలని ఓటుకు నోటు కుట్రకు సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్ అని ఆరోపించారు. అటువంటి చంద్రబాబు గురించి, తెలంగాణకు అన్యాయం చేసిన టీడీపీ గురించి గ్రూప్ 2 పరీక్షలో ప్రశ్నలా అంటూ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరికోసం.? ఎందుకోసం.? ప్రశ్నించారు. ఎట్లుండె తెలంగాణ,  ఎట్లయింది తెలంగాణ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. స్వామి భక్తికి, భానిసత్వానికి ఇది పరాకాష్ట అంటూ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీనా? టీడీపీ పీఎస్సీనా? అని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్