ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను, ప్రభుత్వాలను భయాందోళనకు గురి చేస్తున్న మంకీ ఫ్యాక్స్ నిర్ధారణ కిట్ ను ఏపీలోని మెడ్ టెక్ జోన్ లో తయారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి నిర్ధారణకు సంబంధించి సమయం పడుతుండడంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖలోని మెడ్ టెక్ జోన్ అధికారులు అత్యంత వేగంగా మంకీ పాక్స్ ను నిర్ధారించే కిట్ ను తయారు చేశారు. మెడ్ టెక్ జోన్ తమ భాగస్వామి ట్రాన్స్లేషియా డయాగ్నొస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఎంపాక్స్ (మంకీ ఫాక్స్) వ్యాధి నిర్ధారణకు ఆర్టీపిసిఆర్ కిట్ ను ఉత్పత్తి చేసింది.
ఎర్బాఎండిఎక్స్ మంకీ ఫాక్స్ ఆర్టిపిసిఆర్ కిట్
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను, ప్రభుత్వాలను భయాందోళనకు గురి చేస్తున్న మంకీ ఫ్యాక్స్ నిర్ధారణ కిట్ ను ఏపీలోని మెడ్ టెక్ జోన్ లో తయారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి నిర్ధారణకు సంబంధించి సమయం పడుతుండడంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖలోని మెడ్ టెక్ జోన్ అధికారులు అత్యంత వేగంగా మంకీ పాక్స్ ను నిర్ధారించే కిట్ ను తయారు చేశారు. మెడ్ టెక్ జోన్ తమ భాగస్వామి ట్రాన్స్లేషియా డయాగ్నొస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఎంపాక్స్ (మంకీ ఫాక్స్) వ్యాధి నిర్ధారణకు ఆర్టీపిసిఆర్ కిట్ ను ఉత్పత్తి చేసింది. ఎర్బాఎండిఎక్స్ మంకీ ఫాక్స్ ఆర్టిపిసిఆర్ పేరుతో ఈ కిట్ ను అభివృద్ధి చేశారు. ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదేనని అధికారులు ప్రకటించారు. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) దృవీకరణతోపాటు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతులు మంజూరయ్యాయి. ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణలో భారతదేశం ముందంజలో ఉందనే విషయాన్ని ఇది ప్రతిబిస్తోందని మెడ్ టెక్ జోన్ సీఈవో డాక్టర్ జితేంద్ర శర్మ పేర్కొన్నారు.
ఆరోగ్య రంగంలో భారత దేశ ప్రతిభకు ఇది తార్కానంగా ఆయన అభివర్ణించారు. రెండు వారాల్లో మార్కెట్ లో అందుబాటులోకి ఈ కిట్ వస్తుందని వెల్లడించారు. కోవిడ్ విపత్తు సమయంలో మెడ్ టెక్ జోన్ వైద్య రంగానికి అవసరమైన అనేక ఆవిష్కరణ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రోజుకు ఒక మిలియన్ ఆర్టిపిసిఆర్ కిట్లు, 500 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, 100 వెంటిలేటర్లు ఇక్కడ తయారు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో వైద్య రంగంలో వచ్చే అవసరాలకు అనుగుణంగా అనేక పరిశోధనలు ఇక్కడ సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన కిట్ ద్వారా క్షణాల్లోనే మంకీ పాక్స్ నిర్ధారణ చేసి వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాన్ని చాలా వరకు నియంత్రించేందుకు మార్గం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మంకీ పాక్స్ ఇప్పటికే ప్రపంచంలోనే అనేక దేశాల్లో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మరో కోవిడ్ తరహా అత్యవసర పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్న నేపథ్యంలో మెడ్ టెక్ జోన్ అధికారులు ఈ కిట్ తయారీకి సంబంధించి పరిశోధనలు సాగించి విజయం సాధించారు. ఈ కిట్ ను మార్కెట్లోకి వీలైనంత వేగంగా తీసుకువచ్చే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.