జనసేన పార్టీ ఆవిర్భావ సభలో హిందీ భాష గురించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం ఆయన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. హిందీలోకి తమిళ సినిమాలను ఎందుకు డబ్ చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్‌రాజ్.. హిందీ భాషను రుద్దడం వేరని, మాతృభాషను గౌరవించుకోవడం వేరన్నారు. మీ హిందీ భాషను మాపై రుద్దకండి అని చెప్పడం అంటే ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు. స్వాభిమానంతో తమ మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమేనన్న విషయాన్ని పవన్ కల్యాణ్‌కు ఎవరైనా చెప్పండి అంటూ ఉదయం ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్, ప్రకాష్‌రాజ్
జనసేన పార్టీ ఆవిర్భావ సభలో హిందీ భాష గురించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం ఆయన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. హిందీలోకి తమిళ సినిమాలను ఎందుకు డబ్ చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్‌రాజ్.. హిందీ భాషను రుద్దడం వేరని, మాతృభాషను గౌరవించుకోవడం వేరన్నారు. మీ హిందీ భాషను మాపై రుద్దకండి అని చెప్పడం అంటే ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు. స్వాభిమానంతో తమ మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమేనన్న విషయాన్ని పవన్ కల్యాణ్‌కు ఎవరైనా చెప్పండి అంటూ ఉదయం ట్వీట్ చేశారు. తాజాగా మరోసారి ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. పవన్ కల్యాణ్ పాత ట్వీట్‌ను ఒకటి తవ్వితీసిన ప్రకాష్‌రాజ్.. ’గెలవక ముందు జనసేనాని. గెలిచిన తరువాత భజన సేనాని’ అంతేనా అంటూ తాజా పోస్ట్‌లో ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్‌తో పవన్ రాజకీయ ప్రస్థానం, ఆయన వాఖ్యలపై తీవ్రస్థాయిలో ప్రకాష్‌రాజ్ విమర్శలు గుప్పించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కల్యాణ్ హిందీ భాషపై చేసిన కామెంట్స్ రాజకీయంగా, సామాజికంగా చర్చలకు దారి తీశాయి.
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మరోవైపు డీఎంకే నేతలు కూడా తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించడంతోపాటు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమాలు వేదికగా మరోసారి స్పందించారు. ఒక భాషను బలవంతంగా రుద్ధడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ మన భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణను సాధించడంలో ఉపయోగపడవన్నారు. తానెప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని, దానిని తప్పనిసరి చేయడాన్ని తాను వ్యతిరేకించానని పేర్కొన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా హిందీని తప్పనిసరి చేయలేదని, దానిపై తప్పుడు కథనాలు వ్యాప్తి చేయడం ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. ఏది ఏమైనా ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి.