తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ప్రముఖు నటుడు ప్రకాష్ రాజ్ వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు తాజాగా మరోసారి ఆయన చురకలంటించారు. 'గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత మరో అవతారం.. ఏంటి అవాంతరం.. ఏది నిజం.?' అంటూ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్
తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ప్రముఖు నటుడు ప్రకాష్ రాజ్ వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు తాజాగా మరోసారి ఆయన చురకలంటించారు. 'గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత మరో అవతారం.. ఏంటి అవాంతరం.. ఏది నిజం.?' అంటూ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే జస్ట్ ఆస్కింగ్ అంటూ బుధవారం ఒక పోస్ట్ చేసిన ఆయన.. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 'చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ' ప్రకాష్ రాజు చేసిన ట్వీట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మరో ట్వీట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ వేషధారణ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్ గా మారుతుంది. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడే వారి గురించి ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక వస్త్రధారణ ధరించి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఈ వస్త్రధారణ ఉద్దేశించే ప్రకాష్ రాజ్ తాజా ట్రీట్ ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న విధంగా సామాజిక మాధ్యమాల్లో వార్ నడుస్తోంది. విజయవాడలో అమ్మవారు దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ తోపాటు కార్తీక్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత హీరో కార్తీ క్షమాపణలను కోరారు. అయితే ప్రకాష్ రాజు మాత్రం ఆ వ్యాఖ్యలను తప్పు పట్టేలా మరిన్ని ట్వీట్లు చేస్తూ ఈ వ్యవహారాన్ని రక్తి కట్టిస్తున్నారు. తాను విదేశాల్లో ఉన్నానని ఇండియాకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెబుతానని రెండు రోజుల కిందట ప్రకాష్ రాజు వెల్లడించారు. అయితే, ఈ లోగానే ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల ట్వీట్ల వర్షం కురిపిస్తుండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా చేసిన ట్వీట్లోనూ 'గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటి అవాంతరం.. ఎందుకి మనకీ అయోమయం.. ఏది నిజం.? జస్ట్ ఆస్కింగ్?' అంటూ మరో ట్వీట్ లో సంధించారు.