ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం మీ కోసమే.. ప్రముఖ కంపెనీల్లో అవకాశాలు దక్కే ఛాన్స్

దేశంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. కోట్లాది మంది యువతకు ఇంటర్న్ షిప్ అవకాశాలను, ప్రత్యక్ష వ్యాపార అనుభవాన్ని అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 - 25 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా దేశంలోని అగ్రశ్రేణి 500 కంపెనీలు ఐదేళ్లలో కోటి మంది యువతకు ఇంటర్న్ షిప్ అవకాశాలను కల్పించనున్నారు.

Youth undergoing training in industries

పరిశ్రమల్లో శిక్షణ పొందుతున్న యువత

దేశంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. కోట్లాది మంది యువతకు ఇంటర్న్ షిప్ అవకాశాలను, ప్రత్యక్ష వ్యాపార అనుభవాన్ని అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 - 25 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా దేశంలోని అగ్రశ్రేణి 500 కంపెనీలు ఐదేళ్లలో కోటి మంది యువతకు ఇంటర్న్ షిప్ అవకాశాలను కల్పించనున్నారు. ఈ లక్ష్యంతోనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విభిన్న వృత్తులు, ఉపాధి రంగాల్లో వాస్తవ వ్యాపార వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశాన్ని యువతకు ఈ పథకం కల్పించనుంది. తద్వారా ఇండస్ట్రీకి ఎటువంటి నైపుణ్యం కావాలో అర్థం చేసుకునే దానికి యువతకు అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మందికి ఇంటర్న్ షిప్ అవకాశాలను అందించడమే లక్ష్యంగా ఒక పైలెట్ ప్రాజెక్టును అక్టోబర్ మూడో తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అభివృద్ధి చేసిన ఆన్లైన్ పోర్టల్ www.pminternship.mca.gov.in ద్వారా ఇది అమలు కానుంది. ఇంటర్న్ షిప్ అవకాశాలు అందించే టాప్ 500 కంపెనీలు రిజిస్టర్ చేసుకునేందుకు ఈ పోర్టల్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇంటర్న్ షిప్ కోసం ముందుకు వచ్చే అభ్యర్థుల కోసం ఈ నెల 12 నుంచి పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం గత మూడేళ్లుగా సగటు కార్పోరేట్ సామాజిక బాధ్యత వ్యయం ఆధారంగా అగ్రశ్రేణి కంపెనీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించనుంది. భాగస్వామి సంస్థ తన సొంత కంపెనీలో ఇంటర్న్ షిప్ అందించలేకపోతే దాని అనుబంధ సంస్థలు, గ్రూపులోని ఇతర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఇంటర్న్ షిప్ అవకాశం కల్పించవచ్చు.

ఇంటర్న్ షిప్ కాల వ్యవధి 12 నెలలు ఉంటుంది. ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా తప్పనిసరిగా పనిచేసే వాతావరణంలో నేర్చుకునేలా ఉండాలి. ఈ ఇంటర్న్ షిప్ కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.4500 అందించనుంది. సదర సంస్థలు తన సిఎస్ఆర్ నిధుల నుంచి నెలకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సంస్థ రూ 500 కంటే ఎక్కువ నెలవారి సాయం అందించాలనుకుంటే తన సొంత నిధుల నుంచి ఇవ్వచ్చు. దీనికి అదనంగా ఇంటర్న్  షిప్ ప్రారంభ సమయంలో ప్రతి అభ్యర్థికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.6000 ఇస్తుంది. ఇది ఒక్కసారి సాయం మాత్రమే. నెల నెల ఇవ్వదు. భారత ప్రభుత్వ బీమా పథకాలు అయిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి అభ్యర్థికి భీమా చేస్తారు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. కంపెనీ కూడా అదనపు ప్రమాద బీమా కవరేజీని అందించే అవకాశం ఉంది. ఈ స్కీమ్ లో చేరాలనుకునే అభ్యర్థుల వయసు అర్హతలు ఇలా ఉండాలి. వయసు 21 నుంచి 24 ఎల్లలోపు ఉండాలి.  భారతదేశంలో నివసిస్తూ ఉండాలి. ఫుల్ టైమ్ జాబ్ చేసేవాళ్లు, విద్యార్థులు ఉండకూడదు. ఆన్లైన్ దూర విద్య ద్వారా చదువుతున్న యువత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు విషయానికి వస్తే.. హై స్కూల్ లేదా హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఐటిఐ సర్టిఫికెట్ లేదా పాలిటెక్నిక్ డిప్లమో చేసి ఉండాలి. బిఏ, బిఎస్సి, బీకామ్, బీసీఏ, బి బిబిఏ, బి ఫార్మ వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్