గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనస్వాగతం పలికారు. భారత ప్రతిపాదన కారణంగానే సుబియాంటో పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియాకు చెందిన ఆర్మీ భారత బృందంతో కలిపి ఈ వేడుకల్లో కవాతు చేయనుంది.
ఇండోనేషియా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతున్న ముర్ము, మోదీ
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనస్వాగతం పలికారు. భారత ప్రతిపాదన కారణంగానే సుబియాంటో పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియాకు చెందిన ఆర్మీ భారత బృందంతో కలిపి ఈ వేడుకల్లో కవాతు చేయనుంది. భారతదేశ పర్యటనలో భాగంగా సుభీయాంటో ఇండియాతో ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై ఒప్పందం చేసుకోనున్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. వేడుకలను సజావుగా నిర్వహించేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు.
నగరం చుట్టూ దాదాపు 15 వేల మంది పోలీసులను మోహరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత పర్యటనపై గతంలోనే ఉత్కంఠ నెలకొంది. మొదట ఆయన భారతలో పర్యటించిన అనంతరం పాకిస్తాన్ వెళ్లాలని భావించారు. దీనివల్ల భారతదేశం ముఖ్య అతిథి పేరును ప్రకటించడంలో జాప్యం చేసింది. భారత్ పర్యటన ముగిసిన వెంటనే పాకిస్తాన్ వెళ్లడాన్ని భారత్ సానుకూలంగా తీసుకోలేదు. దీనిపై భారత దౌత్య నీతిని ప్రదర్శించడంతో ఆయన పాకిస్తాన్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉంటే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియా నుండి 352 మంది సభ్యుల కవాతు, బ్యాండ్ బృందం డ్యూటీ లైన్ లో రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటుంది. విదేశాల్లో జరిగే నేషనల్ ఇండియనేషియా కవాతు, బ్యాండ్ స్క్వేడ్లు పాల్గొనడం ఇదే తొలిసారి. గడచిన కొన్నేళ్లుగా భారత్ - ఇండోనేషియా సంబంధాలు బలపడ్డాయి. 2018లో మోడీ ఇండోనేషియాను సందర్శించారు. ఈ సమయంలోనే భారత్ - ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి చేరుకున్నాయి.