పొత్తు వల్లే అధికారం.. ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో చంద్రబాబు గురించి మాట్లాడిన కేసీఆర్‌.. దేశంలోనే అత్యంత పనికిమాలిన రాజకీయ నాయకుడు అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. గతంలో ఏపీలో అధికారంలో జగన్‌ ఉన్న సమయంలో కేసీఆర్‌, జగన్‌ కలిసి మెలిసి ఉన్నారు. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆయన అరెస్ట్‌ కూడా కీలక కామెంట్లు చేశారు. అప్పట్లో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాలం గడిచింది. 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది.

Former Cm Kcr

మాజీ సీఎం కేసీఆర్‌ 

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో చంద్రబాబు గురించి మాట్లాడిన కేసీఆర్‌.. దేశంలోనే అత్యంత పనికిమాలిన రాజకీయ నాయకుడు అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. గతంలో ఏపీలో అధికారంలో జగన్‌ ఉన్న సమయంలో కేసీఆర్‌, జగన్‌ కలిసి మెలిసి ఉన్నారు. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆయన అరెస్ట్‌ కూడా కీలక కామెంట్లు చేశారు. అప్పట్లో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాలం గడిచింది. 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలై కూటమి నేతృత్వంలోని పార్టీలు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఓటమి తరువాత పూర్తిగా సైలెంట్‌ అయిపోయిన కేసీఆర్‌ తాజాగా శనివారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో రామగుండం నియోజకవర్గ నేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక అంశాలపై స్పందించారు. సంపన్నంగా ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధపడుతున్నారని వ్యాఖ్యానించారు. పదేళ్లుగా పచ్చగా ఉన్న తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అది కూడా సింగిల్‌గానే అంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో కూటమి లేకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చే వాళ్లు కాదంటూ పేర్కొన్నారు. బెల్లం దగ్గరకు వచ్చిన ఈగలు మాదిరి తెలంగాణలో సంపద దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. పదేళ్లు తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుగా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎప్పటికీ తెలంగాణ కోసం పోరాటం చేసేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిన వెంటనే సమస్యలు చుట్టుముట్టాయన్నారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరని వ్యాఖ్యానించిన కేసీఆర్‌.. ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌ మాదిరిగా తయారు కావాలని సూచించారు. ఒకనాడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని, తరువాత ఇంధిరాగాంధీ మోసం చేశారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో చాలా పోరాటాలు చేయాలని, అందుకే ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ మాదిరి సిద్ధమవ్వాలన్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్