పోర్నోగ్రఫీకి ప్రత్యామ్నాయం అవసరం.. కీలక సూచనలు చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్

యువతకు వ్యసనంగా మారుతున్న ఫోర్నోగ్రఫీ సమస్య పరిష్కారానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారిన పోర్నోగ్రఫీపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్న్ కంటెంట్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలను ఆకర్షించేంత మరింత ఆసక్తికరమైన, ఉత్సాహవవంతమైన కంటెంట్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Russian President Vladimir Putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

యువతకు వ్యసనంగా మారుతున్న ఫోర్నోగ్రఫీ సమస్య పరిష్కారానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారిన పోర్నోగ్రఫీపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్న్ కంటెంట్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలను ఆకర్షించేంత మరింత ఆసక్తికరమైన, ఉత్సాహవవంతమైన కంటెంట్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అడల్ట్ కంటెంట్కు రష్యాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఇది ప్రపంచ సమస్యగా ఆయన అభివర్ణించారు. పోర్న్ కంటెంట్ను నిషేధించడం అనేది ఈ సమస్య నివారణకు ఒక మార్గమని ఆయన పేర్కొన్నారు. అయితే పూర్ణ కంటెంట్ కంటే మరింత ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాలు చూపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రష్యాలో తగ్గిపోతున్న జననాల రేటును పెంచేందుకు పుట్టిన ఇటీవల చేసిన సూచనలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. పనిచేసే వాళ్లు లంచ్, కాఫీ బ్రేకుల్లో శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు. 

పోర్న్ వినియోగంతో చిన్నారుల్లో విపరీత పోకడలు పెరుగుతున్నాయి. అనేక మంది చిన్నారులు చిన్నవయసులోనే పేడదోవ పడుతున్నారు. ఈ ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు అనుగుణంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ మేరకు సూచనలు చేసినట్లు చెబుతున్నారు. పోర్న్ కు ప్రత్యామ్నాయంగా ఎటువంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది అన్నదానిపై ప్రత్యేకంగా నిపుణులు ఆలోచించాలని చెబుతున్నారు. పుట్టిన సూచించిన ఈ కీలక సూచనలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రష్యాలోని ఒక ప్రముఖ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్