పాపులేషన్ పరేషాన్.. జనాభా తగ్గుదలపై ప్రపంచ దేశాల ఆందోళన

ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లకు చేరింది. ఇప్పటికే భారత్, చైనా వంటి దేశాల్లో 150 కోట్లకు పైగా జనాభా ఉంది. అనేక అగ్ర దేశాల్లో జనాభా భారీగానే ఉంది. అయినప్పటికీ, గడచిన కొన్నాళ్లుగా ఆయా దేశాల్లో జనాభా తగ్గుముఖం పడుతుండడం పట్ల ఆందోళనను సదరు దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. యువ జనాభా తగ్గుముఖం పట్టడం, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటమే ఈ ఆందోళనకు కారణమవుతోంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లకు చేరింది. ఇప్పటికే భారత్, చైనా వంటి దేశాల్లో 150 కోట్లకు పైగా జనాభా ఉంది. అనేక అగ్ర దేశాల్లో జనాభా భారీగానే ఉంది. అయినప్పటికీ, గడచిన కొన్నాళ్లుగా ఆయా దేశాల్లో జనాభా తగ్గుముఖం పడుతుండడం పట్ల ఆందోళనను సదరు దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. యువ జనాభా తగ్గుముఖం పట్టడం, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటమే ఈ ఆందోళనకు కారణమవుతోంది. భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ఆయా దేశాలు జనాభాను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. అందుకు అనుగుణంగానే చర్యలను చేపడుతున్నాయి. ఇప్పటికే చైనాలో పిల్లలను ఎక్కువగా కనడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఇద్దరు, ముగ్గురు పిల్లలు కనే వారికి ప్రోత్సాహాలను అందించేందుకు అక్కడ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందటే రష్యా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో పిల్లలు కనే వారి సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో సెక్స్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పిల్లలను కనే వారికి ప్రోత్సాహకాలను ఇవ్వడంతోపాటు ఎక్కువమంది పిల్లలను కనేలా అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వమే అందించేందుకు సిద్ధమవుతోంది. అవసరమైతే ఉద్యోగులకు సెలవులు, ప్రత్యేక అలవెన్సులు, టూర్ ప్యాకేజీలు వంటివి కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనివల్ల దేశ జనాభాను పెంచుకోవడమే లక్ష్యంగా రష్యా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అలాగే భారత్ కూడా ఇదే తరహా ఆలోచన చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వంటి వారు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనాలని సూచిస్తున్నారు. గతంలో ఎక్కువమంది పిల్లలను కన్నవారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా నిబంధనలను ప్రభుత్వం తీసుకువచ్చింది. రాష్ట్రంలో యువ జనాభా తగ్గుతుండడం, భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉన్న నిబంధనలను తొలగించింది. ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఎక్కువ మంది పిల్లలను కనాలనుకునే వారికి అడ్డంకిగా మారదు. దీంతో ఎంతోమంది పిల్లలను కనేందుకు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ చీఫ్ మోహన్ భగవత్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు. జనాభా సంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని ఆయన తాజాగా హెచ్చరించారు. ప్రస్తుత జనాభా విధానం పాతికేళ్ల కిందటిది ఉందని, జనసంఖ్య వృద్ధిరేటు 2.1కి తగ్గకూడదని అందులో స్పష్టం చేశారని గుర్తు చేశారు. జనాభా వృద్ధిరేటు 2.1కు తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుందని హెచ్చరించారు. కాబట్టి కనీసం భారతీయులు ముగ్గురేసి చొప్పున పిల్లలను కనాలని ఆయన సూచించారు.  

గడచిన కొన్నాళ్లుగా ప్రపంచ జనాభా తగ్గుముఖం పడుతూ వస్తోంది. 

1960-2000 మధ్య ప్రపంచ జనాభా రెట్టింపు అయింది. ఆ తరువాత నుంచి జనాభా తగ్గుముఖం పడుతూ వస్తోందని పలు అధ్యయన నివేదికలో చెబుతున్నాయి. జనాభా భర్తీ రేటు 2.1 సమీపంలో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యూనిషీయా ఉన్నాయి. 2.1 కంటే తక్కువ రేటు ఉన్న దేశాల్లో అమెరికా, మెక్సికో, బ్రెజిల్ ఉన్నాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఇంకా బాగా తక్కువగా ఉండడమే కాక వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. భారత్లోని అనేక రాష్ట్రాలు కూడా ఈ ముక్కు పొంచి ఉండడంతో పిల్లలను ఎక్కువగా కనాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా పలువురు ముఖ్యమంత్రులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్