ఢిల్లీలో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత

దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఐదు గంటల సమయానికి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను ఫిబ్రవరి 8వ తేదీన ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవశం చేసుకోవడంపై దృష్టి సారించింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఐదు గంటల సమయానికి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను ఫిబ్రవరి 8వ తేదీన ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవశం చేసుకోవడంపై దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ అధికారంలోకి రావడం ద్వారా గతంలో ఉన్న పట్టును నిరూపించుకోవాలని భావిస్తోంది. ఒక్కసారైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బిజెపి తహతహలాడుతోంది. అందుకు అనుగుణంగానే ప్రధాన పార్టీలైన ఈ మూడు తమ సర్వశక్తులను ఒడ్డి ప్రచారాన్ని నిర్వహించాయి. ఎన్నికల్లో మొత్తంగా 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండడంతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 1.56 కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను సమస్య ఆత్మకమైన గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. 

ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అనేక చోట్ల కోలాహలం కనిపించింది. ఉదయాన్నే అనేక పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు లో రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అనేక పోలింగ్ కేంద్రాలకు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళుతున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఓటర్లకు విజయ సంకేతాలు చూపిస్తూ ఎంతో మంది నేతలు వెళుతున్నారు. కుటుంబ సమేతంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు రావడం గమనార్హం. 

ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. వాటర్లంతా ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని ప్రధాని కోరారు. తొలిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులందరికి ప్రత్యేక శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. గుర్తుంచుకోండి మొదటి ఓటు - తరువాత రిప్లేస్మెంట్ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్