మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 288 అసెంబ్లీ స్థానాలకు ప్రస్తుతం ఎన్నిక జరుగుతుంది. ఆయా స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తంగా 9,70,25,119 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ముంబైలో ఓటు వేసేందుకు బారులు తీరిన యువత
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 288 అసెంబ్లీ స్థానాలకు ప్రస్తుతం ఎన్నిక జరుగుతుంది. ఆయా స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తంగా 9,70,25,119 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలిసారి ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మొత్తంగా 2086 మంది అభ్యర్థులు వివిధ స్థానాల్లో పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, శరద్ పవర్ ఎంఎన్సీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూటమిగా ఎన్నికల్లో బరిలో దిగుతున్నాయి. మరోవైపు బిజెపి, అజిత్ పవార్ ఎన్సిపి, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలను ఇరుపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. మహా వికాస్ అఘాడీలో ప్రధాన పార్టీగా కాంగ్రెస్, బిజెపి కీలకంగా ఉన్న మహాయుతి కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 1,00,186 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. అనేక నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఇరు కూటములు మధ్య పోటీ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు మందకొడిగా పోలింగ్ సాగినప్పటికీ.. క్రమంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేస్తూ ఉండడంతో ఓటింగ్ శాతం పెరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వందలాది మంది ఓటర్లు బారులు తీరి ఉండడంతో ఓటింగ్ శాతం బాగానే ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ శాతం పెరిగితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమికి మేలు చేస్తుందన్న భావన విశ్లేషకులు నుంచి వినిపిస్తోంది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలను బిజెపితోపాటు కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన అగ్రనేతలు పరిశీలిస్తున్నారు. పోలింగ్ జరుగుతున్న తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఝార్ఖండ్లో కూడా పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచే ప్రారంభమైంది. ఇక్కడ కూడా పోటీ ఆసక్తిని కలిగిస్తోంది. ఝార్ఖండ్ లో 38 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒకటి పాయింట్ 23 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈనెల 13న 43 స్థానాలకు సంబంధించిన తొలిదశ పోలింగ్ పూర్తయింది. ప్రస్తుతం జరుగుతున్న 38 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది.