మరో కీలక అంశంపై సెంటిమెంట్ రాజకీయాల పండించేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు సంబంధించి అప్పటికే చిదంబరం ప్రకటన చేసిన డిసెంబర్ 9వ తేదీన వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై ఒకవైపు బీఆర్ఎస్ పోరు సాగిస్తుండగా.. కెసిఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ రాజకీయాన్ని మరింత రాజేస్తున్నారు. తాజాగా ఇరు పార్టీలు మరో కీలక అంశంపై సెంటిమెంట్ రాజకీయాల పండించేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు సంబంధించి అప్పటికే చిదంబరం ప్రకటన చేసిన డిసెంబర్ 9వ తేదీన వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ఇరు పార్టీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగిస్తున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ ఏర్పాటు..
తెలంగాణలో ప్రస్తుతం ఉత్సవాలకు సంబంధించిన రాజకీయాల వేడి నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విజయోత్సవాలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కెసిఆర్ తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన రోజును దీక్ష దివస్గా చేసుకోవాలని భారతీయ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా అధ్యక్ష దివాస్ నిర్వహించేవారు. అప్పట్లో క్యాడర్ సాదాసీదాగా చేసుకునేది. అధికార పార్టీగా ఉండడంతో అంత ఊపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరంలో బీఆర్ఎస్ ఉంది. అందుకే తెలంగాణ దివస్ ను ఘనంగా చేయాలని జిల్లాలు వారీగా ఇన్చార్జులను నియమించారు. రాజకీయంగా యాక్టివ్ గా ఉండటానికి ఇది చాలా అవసరం మన కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ కేడర్ మొత్తం మళ్లీ ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరాన్ని కెసిఆర్ క్యాడర్కు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరం ఉందంటూ కేటీఆర్ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ జోరుగా ఏర్పాట్లు
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా డిసెంబర్ 9వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. డిసెంబర్ 9వ తేదీన ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా అప్పటికేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. అదే రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని సంబరాలు చేయబోతున్నారు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో టిఆర్ఎస్ ఫైనల్ చేసిన విగ్రహం కాదు. అంతేకాదు పాలనలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మూడో తేదీన బహిరంగ సభ నిర్వహించాలని ఆలోచనలో ఉన్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలో ఎవరో ఒకరు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు వచ్చేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహణకు సిద్ధమవుతుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. తెలంగాణ అంటేనే ఒక ఎమోషనల్. అటువంటి ఎమోషన్ తో కూడిన రాజకీయాలను చేసేందుకు ఒకవైపు బీఆర్ఎస్ ప్రయత్నం సాగిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రయత్నాలను చేస్తుండడం ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ రెండు పార్టీల కార్యాచరణకు పోటీగా బిజెపి ఏదైనా ప్లాన్ చేస్తుందా అన్న ఆసక్తి కూడా సర్వత్ర నెలకొంది.