జంట నగరాల ప్రజలకు పోలీసుల హెచ్చరిక.. నేటి నుంచి 144 సెక్షన్ అమలు

జంట నగరాల ప్రజలకు పోలీసులు హెచ్చరికను జారీ చేశారు. సోమవారం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని, ఇందులో భాగంగానే 144 సెక్షన్ అమలవుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం పోలీసులు ఒక ప్రకటనను విడుదల చేశారు. సోమవారం నుంచి నెలరోజులపాటు ఎటువంటి ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలను విస్మరించి ఈ తరహా చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

Police alert to people of Twin Cities

జంట నగరాల ప్రజలకు పోలీసులు హెచ్చరిక

జంట నగరాల ప్రజలకు పోలీసులు హెచ్చరికను జారీ చేశారు. సోమవారం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని, ఇందులో భాగంగానే 144 సెక్షన్ అమలవుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం పోలీసులు ఒక ప్రకటనను విడుదల చేశారు. సోమవారం నుంచి నెలరోజులపాటు ఎటువంటి ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలను విస్మరించి ఈ తరహా చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని, కేటీఆర్ బావమరిది సోదరుడికి చెందిన రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ దగ్గర పోలీసులు సోదాలు నిర్వహించడం వంటి పరిణామాలు నేపథ్యంలో బిఆర్ఎస్ ఆందోళనలు, ధర్నాలకు పిలుపునిస్తారని ఆలోచనతో పోలీసులు ఈ మేరకు ముందస్తు చర్యలకు దిగినట్లు చెబుతున్నారు. తాజా చర్యలు ద్వారా ఈ తరహా ఆందోళనలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తాజాగా పోలీసులు జారీచేసిన ఈ ప్రకటనల పట్ల ప్రజలతోపాటు రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని వాటిపైన ఉక్కు పాదం మోపేలా ఈ విధంగా వ్యవహరించడం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు. 

ఇదిలా ఉంటే పోలీసులు జారీచేసిన హెచ్చరికలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే పోలీసులు తీసుకున్న ఈ చర్యలు రేవ్ పార్టీ నేపథ్యంలోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల సోదరుడి ఇంటి దగ్గర కూడా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉండడంతో పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తుందని చెబుతున్నారు. అయితే తాజా చర్యలు నేపథ్యంలో బిఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ దీనిపై కొద్ది క్షణాల్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్