హుస్సేన్‌ సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై పోలీసుల ఆంక్షలు.. ప్లెక్సీలు ఏర్పాటు

హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు నిర్వహణతోపాటు నిమజ్జన వేడుకలు కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు. నిమజ్జనం సందర్భంగా హుస్సేన సాగర్‌ పరిసరాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే, ఈసారి హుస్సేన్‌ సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడంపై పోలీసులు ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాలు మేరకు ఈసారి వినాయక విగ్రహాల నిమజ్జనాలకు అనుమతించడం లేదని ట్యాంక్‌ బండ్‌పై ప్రత్యేకంగా పోలీసులు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Flexi set up by the police

పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు నిర్వహణతోపాటు నిమజ్జన వేడుకలు కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు. నిమజ్జనం సందర్భంగా హుస్సేన సాగర్‌ పరిసరాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే, ఈసారి హుస్సేన్‌ సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడంపై పోలీసులు ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాలు మేరకు ఈసారి వినాయక విగ్రహాల నిమజ్జనాలకు అనుమతించడం లేదని ట్యాంక్‌ బండ్‌పై ప్రత్యేకంగా పోలీసులు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రతి వంద మీటర్లకు ఒకటి చొప్పున ప్లెక్సీ ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ట్యాంక్‌ బండ్‌ గ్రిల్సకు భారీ ఎత్తున ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. మరో వైపు ఎన్‌టీఆర్‌ మార్గ్‌, పీవీ మార్గ్‌ వైపు భారీ క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది. 

హుస్సేన్‌ సాగర్‌లో ఏటా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. అయితే, దీనిపై గతంలో హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, హెచ్‌ఎండీఏలను ఆదేశిస్తూ ట్యాంక్‌ బండ్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం కాకుండా చూడాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే అధికారులు ఈ మేరకు ఆంక్షలను విధించారు. ఏటా వేలాదిగా పీవోపీ విగ్రహాలు ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనం జరుగుతుండడంతో అధికారులు గుర్తించారు. గతేడాది 20 వేలకుపైగా పీవోపీ విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు లెక్కలు చెబుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఈ ఏడాది హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి దాదాపు ఐదు లక్షలకుపైగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. వీటి నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆరు జోన్లలో 27 బేబీ పాండ్స్‌, 24 పోర్టబుల్‌ పాండ్స్‌, 20 ఎక్సావేషన్‌ పాండ్స్‌ను ఏర్పాటు చసింది. సమీపంలోని ప్రజలంతా వీటిని వినియోగించుకుని నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్యాంక్‌ బండ్‌పై ప్లెక్సీలు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా పోలీసులు ఆంక్షలతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్