ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై పోలీసులకు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు అందింది. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం పేరుతో తన సొంత ఇంటికి రూ.46 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ ఫిర్యాదు చేశారు.

ys jaganmohan reddy

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి



ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు అందింది. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం పేరుతో తన సొంత ఇంటికి రూ.46 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ ఫిర్యాదు చేశారు. గుంటూరు ఏఎస్పీ శ్రీనివాసరావుకు ఈ మేరకు ఆయన ఫిర్యాదును అందించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా వినియోగించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయం పేరుతో ఇంటికి ప్రజాధనాన్ని వినియోగించడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కింద జగన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది ఎలా ఉంటే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలను వినియోగించడం పట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. ప్రభుత్వ ఖర్చుతో ఇంటిలో సోకులు చేసుకున్నారు అంటూ టిడిపి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. ఫర్నిచర్ వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది టిడిపి. అదే సమయంలో మాజీ మంత్రి కోడేల శివప్రసాదరావు కుమారుడు కూడా తన తండ్రి పై పెట్టిన కేసులు లాంటిదే జగన్మోహన్ రెడ్డి పై కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లోని ఫర్నిచర్ కేంద్రంగా పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్