ఆర్జీవి వ్యవహారంలో పోలీసులు, మీడియా సైలెన్స్.. కారణం అదేనా.?

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపైన కూడా కేసు పెట్టారు. కేసు నమోదైన తర్వాత హైదరాబాదులోని రామ్ గోపాల్ వర్మ డెన్ కు వెళ్లి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల కిందట రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే కొంతమంది పోలీసులు ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్లి రామ్ గోపాల్ వర్మ డెన్ బయట నిరీక్షించారు. రామ్ గోపాల్ వర్మ డన్ వద్ద ఉన్న పోలీసులను చూసిన పలు మీడియా సంస్థలు ఆయనను అరెస్టు చేయడానికి వచ్చారంటూ కథనాలు ప్రచురించాయి.

Ramgopal varma

రామ్ గోపాల్ వర్మ

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అలాగే వైసిపి నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కూటమి నాయకులు దాడులకు తెగబడడంతోపాటు ప్రభుత్వం కూడా అటువంటి వారిపై కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్లో పెడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వైసీపీకి సపోర్ట్ చేసిన ముఖ్యులపై తమ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు ద్వారా ఫిర్యాదులు చేయించింది టిడిపి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి, పోసాని కృష్ణ మురళి, అలీ వంటి వారిపై అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వల్ల ఎదురయ్య ఇబ్బందులను ముందుగానే ఊహించిన వారంతా రాజకీయాలకు దూరంగా ఉంటామని, వైసిపికి తమకు ఇక సంబంధాలు ఉండవంటూ ప్రకటించారు. ఇదే తరహాలో గతంలో వైసిపికి బాహటంగానే సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపైన కూడా కేసు పెట్టారు. కేసు నమోదైన తర్వాత హైదరాబాదులోని రామ్ గోపాల్ వర్మ  డెన్ కు వెళ్లి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల కిందట రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అందుకు అనుగుణంగానే కొంతమంది పోలీసులు ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్లి రామ్ గోపాల్ వర్మ  డెన్ బయట నిరీక్షించారు. రామ్ గోపాల్ వర్మ డన్ వద్ద ఉన్న పోలీసులను చూసిన పలు మీడియా సంస్థలు ఆయనను అరెస్టు చేయడానికి వచ్చారంటూ కథనాలు ప్రచురించాయి. ఆర్జీవిని కొద్ది క్షణాల్లో అరెస్టు చేయబోతున్నారంటూ సదరు మీడియా ఛానల్స్ పెద్ద ఎత్తున బ్రేకింగ్ ఇస్తూ హడావిడి చేశాయి. ఆర్జీవి లోపల లేడు అని తెలుసుకున్న పలు మీడియా సంస్థలు పోలీసులు వస్తున్నారని తెలుసుకొని భయపడి పారిపోయాడంటూ కథనాలు ప్రచురించాయి. ఆర్జీవి పరార్, ఆర్జీవి దౌడో వంటి శీర్షికలను పెట్టి మరి ఆట ఆడేసుకున్నాయి మీడియా సంస్థలు. పారిపోయిన ఆర్జీవిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బృందాలను దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లాయని, ఈ మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను పంపించారంటూ ప్రచారం చేశాయి.  

అందరిని షాక్ కు గురి చేసేలా ఆర్జీవి ఇంటర్వ్యూలు..

సదరు మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలను బట్టి ఆర్జీవి ఎప్పుడు కనపడితే అప్పుడు అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని అంతా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రస్తుతం పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ఆర్జీవి గడిచిన రెండు వారాల నుంచి హైదరాబాదులోనే ఉంటున్నారు. ప్రముఖ మీడియా సంస్థలతోపాటు యూట్యూబ్ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు తనను అరెస్టు చేసేందుకు రాలేదని, డెన్ లోకి రమ్మన్న వాళ్లు రాలేదంటూ పేర్కొంటున్నారు. తనను అరెస్టు చేస్తారని పోలీసులు ఎక్కడా చెప్పలేదని, మరి కొందరు అత్యుత్సాహాన్ని ఎందుకు ప్రదర్శించారో తెలియడం లేదంటూ వారిని ఏకపారేశారు. మీడియా సంస్థలు చేసిన ప్రసారాలన్నీ బోగస్ అన్న విధంగా రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోను ఇంటర్వ్యూలకు ముందుగానే వదిలారు. ఆ వీడియోలో చెప్పినట్టుగానే ప్రస్తుతం అనేక మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలోను స్పష్టం చేస్తున్నారు.

తనను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, తాను పోలీసులకు చెప్పాల్సిన విషయాలను చెబుతున్నానని వెల్లడించారు. తాను ఎప్పుడో పెట్టిన పోస్ట్ పై ఎవరి మనోభావాలు దెబ్బతిని ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందంటూ ఆయన పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. మొన్నటి వరకు ఆర్జీవి కనిపించడం లేదంటూ హడావిడి చేసిన మీడియా సంస్థలు ఇప్పుడు అదే ఆర్జీవి ఇంటర్వ్యూలను ఇస్తుండడం గమనార్హం. ఆర్జీవి పారిపోయాడు అంటూ హడావిడి చేసిన మీడియా ఇప్పుడు ఆయన కనిపిస్తున్న సైలెంట్ గా ఉండడం దేనికి సంకేతం అర్థం కావడం లేదు అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఆర్జీవి డెన్ వద్దకు వెళ్లి హడావిడి చేసిన పోలీసులు కూడా ఇప్పుడు ఆయన హైదరాబాదులోనే ఉన్నప్పటికీ కనీసం స్పందించకపోవడం గమనార్హం. న్యాయపరంగా ఆర్జీవి కీలకమైన భరోసాను దక్కించుకోవడం వల్లే ఈ తరహా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.  ఏది ఏమైనా ఆర్జీవిని పిరికివాడిగా ఎస్టాబ్లిష్ చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించిన మీడియా సంస్థలకు ఆయన ప్రస్తుతం చేస్తున్న చర్యలు షాక్ కలిగిస్తున్నాయనే చెప్పాలి. ఆర్జీవి బయట కనిపిస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్న పోలీసులు, మీడియా సైలెంట్ కావడం దేనికి సంకేతం అర్థం కావడం లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్