ప్రకృతి సృష్టించిన విధ్వంసంతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పర్యటించనున్నారు. అందులో భాగంగా చూరల్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన సందర్శిస్తారు. అనంతరం జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో కన్నూరుకు ప్రధాన నరేంద్ర మోడీ చేరుకుంటారు.
ప్రధాని నరేంద్ర మోడీ
ప్రకృతి సృష్టించిన విధ్వంసంతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పర్యటించనున్నారు. అందులో భాగంగా చూరల్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన సందర్శిస్తారు. అనంతరం జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో కన్నూరుకు ప్రధాన నరేంద్ర మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా ప్రధాని మోదీ వీక్షించనున్నారు. ఈ సందర్భంగా వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని కూడా వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే సీఎం వినరయి కేరళలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 420 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించామని సీఎం వెల్లడించారు. మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇందుకోసం గాలింపు చర్యలను కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అధికారికంగా 225 మంది మృతి చెందారని, వివిధ ప్రాంతాల్లో మొత్తం 195 మృతదేహాలు లభ్యమయ్యాయి అని ఆయన పేర్కొన్నారు. ఈ మృతదేహాలకు సంబంధించి డిఎన్ఎ శాంపుల్స్ వైద్య పరీక్షలు కోసం పంపించామని వెల్లడించారు. 178 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు సీఎం తెలిపారు. ఇదిలా ఉంటే వయనాడ్ ఘటనపై దక్షిణ భారతదేశానికి చెందిన చలనచిత్ర పరిశ్రమ స్పందించి సిఎండిఆర్ఎఫ్ కు నిధులు అందజేసిన విషయాన్ని సీఎం పినరయి గుర్తు చేశారు. వయనాడ్ లో పది రోజుల సహాయక చర్యలు పూర్తి కావడంతో భారత సైన్యం తిరిగి వెళ్లిపోయిందన్నారు. గాలింపు చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపకదళం, కేరళ పోలీసులు పాల్గొన్నాయని కేరళ ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లను చేశారు. ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొద్ది క్షణాల్లోనే ప్రధాని మోదీ వయనాడ్ పర్యటన ప్రారంభం కానుంది.