పవన్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్ కు ముగింపు పడినట్టేనా..! పవన్ కు విషెస్ చెప్పిన బన్నీ

గడచిన కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వార్ నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసిన శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతుగా బన్నీ అక్కడకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. అప్పటి నుంచి జనసేన శ్రేణులు బన్నీని లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లడం పట్ల అప్పట్లోనే నాగబాబు సెటైరికల్ గా స్పందించారు.

Pawan Kalyan and Allu Arjun

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ 

గడచిన కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వార్ నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసిన శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతుగా బన్నీ అక్కడకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. అప్పటి నుంచి జనసేన శ్రేణులు బన్నీని లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లడం పట్ల అప్పట్లోనే నాగబాబు సెటైరికల్ గా స్పందించారు. దీనిపై బన్నీ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఆ ట్వీట్ ను నాగేంద్రబాబు తొలగించారు. ఆ తర్వాత కూడా ఇరువురి ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతూనే వస్తోంది. తాజాగా బన్నీ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఈ వార్ మరింత ముదిరినట్టు అయింది. ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మామ కూడా స్పందిస్తూ తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యానాలు చేశారు. ఈమధ్య జరిగిన ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడిన అల్లు అర్జున్ కూడా తాను నమ్మిన వారి కోసం ఎంతవరకైనా వెళ్తాను అని, తన అభిమానులు అంటే తనకు పిచ్చి అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల ద్వారా తాను ఎవరికి తలొగ్గే ప్రసక్తే లేదు అనే సందేశాన్ని ఆయన ఇచ్చినట్టు అయింది. ఈ నేపథ్యంలో పుష్ప-2 విడుదలను అడ్డుకుంటామంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానిస్తున్నారు. పుష్ప-2 సినిమా ఎలా హిట్ అవుతుందో అంటూ శపథాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల మధ్య జరుగుతున్న ఈ వార్ కు ముగింపు పలికేలా అల్లు అర్జున్ సోమవారం స్పందించారు. సోమవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ స్పందించారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరకంగా ఈ విషెస్ అభిమానుల మధ్య జరుగుతున్న వార్ కు ముగింపు పలికినట్టుగా చెప్పవచ్చని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఈ విషెస్ ను కూడా పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు అంగీకరించడం లేదు. ఈ విషెస్ చెప్పిన తీరును కూడా పలువురు అభిమానులు తప్పుపడుతున్నారు. పుష్ప-2 సినిమా కోసమే అల్లు అర్జున్ ఇలా శుభాకాంక్షలు చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చి ప్రయత్నం చేశాడంటూ పలువురు వ్యాఖ్యానిస్తుండగా, ఈ శుభాకాంక్షలు కింద పలువురు అల్లు అర్జున్ ట్రోల్ చేస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా గడిచిన కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య జరుగుతున్న వాగ్వాదానికి ముగింపు పలికే ప్రయత్నాన్ని అల్లు అర్జున్ చేయడం కొంతవరకు హర్షించదగ్గ విషయంగా పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్