జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ఈ భేటీ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలు, పార్టీ పరంగా ఎమ్మెల్యేలు, నేతలు ఎటువంటి అంశాలపై మాట్లాడాలి అన్నదానిపై పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. సాధారణంగా అయితే ఈ భేటీకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ గడిచిన కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు, మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం, తాజాగా మంత్రులు, ముఖ్య కార్యదర్షులతో సీఎం నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ఈ భేటీ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలు, పార్టీ పరంగా ఎమ్మెల్యేలు, నేతలు ఎటువంటి అంశాలపై మాట్లాడాలి అన్నదానిపై పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. సాధారణంగా అయితే ఈ భేటీకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ గడిచిన కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు, మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం, తాజాగా మంత్రులు, ముఖ్య కార్యదర్షులతో సీఎం నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందువల్లే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదంటూ ఆ పార్టీ నాయకులు, కూటమి నాయకులు చెబుతూ వచ్చారు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాలను సందర్శించే యాత్రకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన నాలుగు రోజులపాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శించనున్నారు. ఇప్పటికే ఆయన యాత్ర ప్రారంభమైంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా ఆయన చెప్పనట్లు ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూటమిలో చెలరేగిన వివాదంలో భాగమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చేరికల విషయాన్ని ప్రస్తావించే అవకాశం..
వైసీపీకి చెందిన ఎంతో మంది నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే వీరిలో ఎక్కువమంది కేసుల నుంచి ఉపశమనం పొందేందుకే జనసేనలో చేరేందుకు వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ చేరికలను కూటమి పార్టీలోని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న నేతల వివరాలను ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ వెల్లడించే అవకాశం ఉంది. వీరిని పార్టీలో చేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అన్నదానిపై పార్టీ నేతలు నుంచి అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ బలోపేతం కావాలి అంటే అనేక జిల్లాల్లో బలమైన నేతలు అవసరం ఉందన్న అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తుండడం వల్లే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా భవిష్యత్తు కార్యాచరణను ఆయన వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా జనసేన పోషించేందుకు సిద్ధంగా ఉందని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తే విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండవద్దని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాలకు డుమ్మాకొడితే అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై పార్టీ నిర్ణయాన్ని కూడా తీసుకోవడానికి ఈ సమావేశంలో అవకాశం ఉంటుందని చెబుతున్నారు.