అధికారులపై ఈగ వాలినా మీదే బాధ్యత.. జగన్‌ను హెచ్చరించిన పవన్‌ కల్యాణ్‌

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులను బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరని, వారిపై ఈగ వాలినా జగనే బాధ్యత వహించాలంటూ పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Speaking Deputy CM Pawan Kalyan

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులను బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరని, వారిపై ఈగ వాలినా జగనే బాధ్యత వహించాలంటూ పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లతోపాటు అధికారులకు ఎవరైనా వార్నింగ్‌ ఇస్తే సుమోటాగా తీసుకుని కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసులు, అధికారులపై ఇష్టం వచ్చినట్టు జగన్‌, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నరన్న పవన్‌.. తమది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 20 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పి పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారని, రోడ్డు మీద నిరసనలు చేస్తున్న మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టించారని ఆరోపించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడిని సప్త సముద్రాలు ఆవల ఉన్నా వదలమని జగన్‌ అంటున్నారని.. డీజీపీని రిటైర్‌ అయినా వదలమని భయపెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్న పవన్‌ కల్యాణ్‌.. ఇంట్లో కూర్చుని రోడ్డు మీద ఆడ బిడ్డలకు రక్షణ లేదని విమర్శించడం సమంజసం కాదన్నారు.

గతంలో సీఎం పర్యటనలు పేరిట ఇష్టానుసారంగా రోడ్ల పక్కన ఉన్న చెట్లు నరికేశారని, ఈ చర్యలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీశాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెట్ల నరికివేత మీద చర్యలు మొదలుపెడితే వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు ఊచలు లెక్కించాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఊహించనన్ని సమస్యలు కూటమి ప్రభుత్వానికి వచ్చాయన్న పవన్‌ కల్యాణ్‌.. లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలతోపాటు సరస్వతి పవర్‌ భూముల్లో 76 ఎకరాలు అసైన్డ్‌, చుక్కలు భూములను ఆక్రమించారని పేర్కొన్నారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానీయమన్న పవన్‌ కల్యాణ్‌.. వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని అధికారులకు సూచించారు. అటవీ సంపద పరిరక్షణలో ఒక ఐఎఫ్‌ఎస్‌ అధికారితోపాటు 23 మంది సిబ్బంది ప్రాణాలను కోల్పోయారని, విధి నిర్వహణలో అసువులు బాసిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్