జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో, పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జగనన్న కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతున్నట్టు వెల్లడించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్టు తెలిపారు. సుద్దగడ్డ వాగు సమస్యకు పిఠాపురం ఎమ్మెల్యేగా శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో, పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జగనన్న కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతున్నట్టు వెల్లడించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్టు తెలిపారు. సుద్దగడ్డ వాగు సమస్యకు పిఠాపురం ఎమ్మెల్యేగా శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీలు పేరుతో గొల్లప్రోలులో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారన్నారు. ఆ తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొన్నారన్న పవన్ కల్యాణ్.. ఎకరా భూమి మార్కెట్ ధర రూ.30 లక్షలు కాగా, రూ.60 లక్షలు చెల్లించి మరీ కొనుగోలు చేశారంటూ ఆరోపించారు. ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై కలెక్టర్‌తో ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా ప్రజల బాధలు చూసి క్షేత్రస్థాయిలో పర్యటించినట్టు తెలిపారు. విజయవాడలో బుడమేరులో అక్రమ నిర్మాణాలపైనా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుడమేరకు సంబంధించిన భూమిలో తెలిసో, తెలియకో కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు. ఆక్రమిత స్థలం అని తెలియక కొనుగోలు చేసినవాళ్లు ఉన్నారన్నారు.
అక్రమ నిర్మాణాలను హైదరాబాద్‌లో హైడ్రా వంటి వ్యవస్థతో కూల్చివేస్తున్నారని, అయితే ఇక్కడ ముందు ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, కాలువలు, వాగుల పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తక్కువ సమయంలో కురిసిన వర్షాలతోనే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడినట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వరద వంటి విపత్తులు తరువాత కోలుకునేందుకు సమయం పడుతోందని, రాష్ట్రంలో కూడా వరదలు తరువాత కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తోందని, అన్ని విధాలుగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారన్నారు. విజయవాడలో ఉంటూ ప్రజలను ఆయన ఆదుకుంటున్న తీరు గొప్పగా ఉందని ప్రశంసించారు. ముడమేరు గండ్లను సాధ్యమైనంత త్వరంగా పూడ్చినట్టు పవన్ తెలిపారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలు ఢీకొనడంతో దెబ్బతిన్న గేట్లు స్థానంలో స్టీల్‌తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్స్ ఏర్పాటు ప్రక్రియ ముగిసినట్టు పవన్ తెలిపారు.