అపోలో ఆసుపత్రికి పవన్ కళ్యాణ్.. ఆ పరీక్షలు చేయించిన వైద్యులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన కొన్నాళ్లుగా ఆయన ఆధ్యాత్మిక పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనక కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనట్లు తెలిసింది. వైద్యుల సలహా మేరకు కొన్ని పరీక్షలు నిర్వహించుకునేందుకు శనివారం రాత్రి అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల సూచనల మేరకు ఆయనకు స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. రిపోర్టులు పరిశీలించిన వైద్యులు పవన్ కు కొన్ని కీలక శోచనలు చేసినట్లు తెలిసింది. ఈ నెలాకులను గాని మార్చి మొదటి వారంలో గాని మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించినట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రికి వెళ్లడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.

Pawan Kalyan in the hospital

ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన కొన్నాళ్లుగా ఆయన ఆధ్యాత్మిక పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనక కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనట్లు తెలిసింది. వైద్యుల సలహా మేరకు కొన్ని పరీక్షలు నిర్వహించుకునేందుకు శనివారం రాత్రి అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల సూచనల మేరకు ఆయనకు స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. రిపోర్టులు పరిశీలించిన వైద్యులు పవన్ కు కొన్ని కీలక శోచనలు చేసినట్లు తెలిసింది. ఈ నెలాకులను గాని మార్చి మొదటి వారంలో గాని మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించినట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రికి వెళ్లడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ కి ఏమైందంటూ సెర్చ్ చేస్తున్నారు. తమకు తెలిసిన ముఖ్యనాథుల ద్వారా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈనెల 24వ తేదీ నుంచి మొదలయ్యే ఏపీ బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న సమాచారాన్ని జనసేన పార్టీ అధికారికంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్ చేసింది. పవన్ కళ్యాణ్ గడిచిన కొద్ది రోజులుగా బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గతంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సమయంలోనే ఆయన ఆయుర్వేద వైద్యుల సలహాలను తీసుకున్నట్లు చెబుతున్నారు. కొన్ని మూలికలు కూడా తీసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సమయంలో వెళ్ళిన ఉప కారణంగా ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని చెప్పారు. వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తుండడం వల్లే పవన్ కళ్యాణ్ పరీక్షలు చేయించుకున్నట్లు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే మరోవైపు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ భేటీ కానన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్పై ఎలా చర్చించాలి అనే అంశాలను ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు. గడచిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్షపాత్రను జనసేన పోషించింది. ఇప్పుడు కూడా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే బాధ్యతను జనసేన తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాలకు రానున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి లక్ష్యంగా జనసేన అనుసరించే వ్యూహం ఎలా ఉంటుంది అన్నదానిపైన ప్రాధాన్యత నెలకొంది. గతంలో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గురించి వైసిపి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గడిచిన 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రమే వైసిపి నాయకులు అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. అసలు అసెంబ్లీకి రాకూడదని వైసిపి నిర్ణయించుకుంది. కానీ అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఆ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు వైసిపి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి వైఖరిని తీసుకొని అసెంబ్లీలో వ్యవహరిస్తారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్