హిందుత్వ అజెండాతో ముందుకు పవన్ కళ్యాణ్.. ఏపీలో వర్కౌట్ అయ్యేనా.!

బిజెపి మాదిరిగా హిందుత్వ ఎజెండాను భుజాలపైకి ఎత్తుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారా.? అంటే అవునన్నా సమాధానమే రాజకీయ విశ్లేషకులు నుంచి వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ను ముందు నుంచి చూసిన వాళ్లకు, ఇప్పుడు ఆయనను చూస్తున్న వారికి ఆయన వ్యక్తిత్వం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తొలి నుంచి లెఫ్టిస్ట్ భావజాలంతో మెలిగినట్టుగా కనిపిస్తుంటారు. గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో చేగువేరా గురించి ప్రస్తావించారు.

Pawan Kalyan speaking in Varahi Sabha

వారాహి సభలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ సమీకరణాల్లో భాగంగా సరి కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారా.? బిజెపి మాదిరిగా హిందుత్వ ఎజెండాను భుజాలపైకి ఎత్తుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారా.? అంటే అవునన్నా సమాధానమే రాజకీయ విశ్లేషకులు నుంచి వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ను ముందు నుంచి చూసిన వాళ్లకు, ఇప్పుడు ఆయనను చూస్తున్న వారికి ఆయన వ్యక్తిత్వం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తొలి నుంచి లెఫ్టిస్ట్ భావజాలంతో మెలిగినట్టుగా కనిపిస్తుంటారు. గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో చేగువేరా గురించి ప్రస్తావించారు. గతంలోనూ ఆయన మహిళల రక్షణకు ప్రత్యేక ఫోర్సును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఆయన కమ్యూనిస్టులతో కలిపి ఎన్నికలకు వెళ్లారు. ఈ సమాజం పట్ల విరక్తితో తాను అడవుల్లోకి వెళ్లిపోవాలని భావించినట్లు గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అదే వ్యూహార శైలిని ఆయన కొనసాగిస్తూ వచ్చారు. జనసేన పార్టీ కండువాగా ఎర్రని గుడ్డను పెట్టుకున్నారు. దీంతో జనసేనను ఒకరకంగా కమ్యూనిస్టు పార్టీలకు దగ్గరగా మెలిగేలా మరో పార్టీ ఏర్పాటయింది అన్న భావన చాలా మందిలో కనిపించింది. అయితే, అటువంటి ఆలోచనల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రమంగా బయటకు వస్తున్నట్లు స్పష్టమవుతోంది. గత కొన్నాళ్లుగా ఆయన పూర్తిగా హిందూత్వ భావజాలంలోకి మారిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఆయన చేపట్టే దీక్షలు, తాజాగా తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లు పరిశీలించిన ఎంతోమంది.. పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు రాజకీయాలను హిందుత్వ కేంద్రంగా నడుపునున్నట్లు పేర్కొంటున్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయన పూర్తిగా హిందూ సమాజాన్ని తనవైపు మళ్లించుకునేలా వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దేశంలో హిందుత్వ సమాజం మద్దతుతో బిజెపి బలీయమైన శక్తిగా ఎదిగింది. కానీ, ఏపీలో మాత్రం వారి పాచిక మారడం లేదు. కొన్నేళ్లుగా పార్టీని పటిష్టం చేసేందుకు అనేక వ్యూహాలను అమలు చేసినప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆస్థానాన్ని భర్తీ చేసుకునేందుకు తాను సిద్ధపడుతున్నట్లు తాజాగా ఆయన వ్యవహార శైలి ద్వారా, రాజకీయ అడుగుల ద్వారా చెప్పవచ్చు.

తిరుపతి లడ్డు వివాదం బయటికి వచ్చిన తర్వాత ఆయన హిందుత్వ సమాజాన్ని తట్టి లేపేలా ఒకరకంగా చెప్పాలంటే భావోద్వేగాన్ని రగిలించేలా వ్యాఖ్యానించారు. ఆ తరువాత విజయవాడ అమ్మవారి గుడిమెట్లను శుభ్రం చేయడం ద్వారా మరింత మంది హిందువులను తన వైపు చూసేలా చేశారు. తాజాగా తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. హిందూ మతం గురించి, దేవుళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారిపై కోర్టులు, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలు ఏమీ అనడం లేదని, హిందుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే వారి గురించి తాము మాట్లాడితే మాత్రం తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి. లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సర్వత్ర ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన ప్రశ్నిస్తున్నట్టుగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదిగేందుకు హిందువులను తన వైపు చూసేలా చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా పలువురు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో హిందువులంతా తనవైపు ఉండేలా చేసుకునే ఉద్దేశంలోనే పవన్ కళ్యాణ్ ప్రణాళికతో ఈ మేరకు అడుగులు వేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అయితే, గడిచిన కొన్నాళ్లుగా బిజెపి అనుసరించిన ఈ విధానం రాష్ట్రంలో సత్ఫలితాలను ఇవ్వని నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ అనుసరించనున్న ఈ వ్యూహాన్ని అనుసరించడం ద్వారా ఎటువంటి ఫలితాలను రాబట్టుకుంటారో చూడాల్సి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్