స్పామ్ కాల్స్ తో పరేషాన్.. అత్యధిక కాల్స్ వస్తున్న జాబితాలో రెండో స్థానంలో ఏపీ

స్పామ్ కాల్స్ ను ఆన్సర్ చేస్తున్న వారిలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా ఏపీ రెండో స్థానంలో ఉంది. స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ లపై ఎయిర్టెల్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ నివేదికను విజయవాడలో విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో ఈ సర్వే చేసింది. ఈ నివేదిక ప్రకారం ఢిల్లీ తర్వాత స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ లతో బాధపడే సెల్ ఫోన్ యూజర్లు ఏపీలో అధికంగా ఉన్నారు.

spam call

స్పామ్ కాల్

ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో సంబంధంలేని కాల్స్ ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. రుణాలు మంజూరు చేస్తామనో, స్థలం కొనుగోలు చేయండనో, ఫ్లాటు ఖాళీగా ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటూ.. ఇలా విభిన్నమైన అంశాలతో వినియోగదారులకు కొన్ని రకాల ఫోన్లో వస్తున్నాయి. ఇటువంటి కాల్స్ ఎక్కువగా ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు వస్తుండడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటువంటి ఫోన్ కాల్స్ వినియోగదారులకు చిరాకు తెప్పిస్తుంటాయి. రోజులో కనీసం రెండు మూడు సార్లు అయినా ఇటువంటి ఫోన్లు వచ్చే వినియోగదారులు ఎంతోమంది ఉంటారు. ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు. ముఖ్యమైన ఫోన్ కాల్స్ అని ఆన్సర్ చేస్తే ఇటువంటి సమాచారాన్ని చెబుతూ ఉంటారు. అర్థం కాని భాషలో కొంత మంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి ఫోన్ కాల్స్ ను స్పామ్ కాల్స్ గా టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) గుర్తించింది. ఈ తరహా స్పామ్ కాల్స్ బాధితులు ఏపీలో అధికంగా ఉన్నారు.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ ను ఆన్సర్ చేస్తున్న వారిలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా ఏపీ రెండో స్థానంలో ఉంది. స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ లపై ఎయిర్టెల్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ నివేదికను విజయవాడలో విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో ఈ సర్వే చేసింది. ఈ నివేదిక ప్రకారం ఢిల్లీ తర్వాత స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ లతో బాధపడే సెల్ ఫోన్ యూజర్లు ఏపీలో అధికంగా ఉన్నారు. స్పామ్ కాల్స్ ను స్వీకరిస్తున్న వారిలో 79 శాతం మంది పురుషులు, 21 శాతం మంది మహిళలు ఉన్నారు. ఢిల్లీ, ముంబై, కర్ణాటక నుంచి ఎక్కువగా ల్యాండ్ లైన్ ల నుంచి ఈ కాల్స్ వస్తున్నాయి. 35 శాతం మంది స్పామర్లు ల్యాండ్ లైన్ ను ఉపయోగిస్తున్నారు. ఈ కాల్స్ పని దినాల్లో ఎక్కువగా వస్తున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఫోన్లు చేసే స్పామర్లు ఆదివారం మాత్రం దూరంగా ఉంటున్నారు  ఆదివారం 40% వరకు స్పామ్ కాల్స్ తగ్గుతున్నాయి. ఈ కాల్స్ ఎక్కువగా ఢిల్లీ, ముంబై, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. స్పామ్ ఎస్ఎంఎస్ లు మాత్రం గుజరాత్, ఉత్తరప్రదేశ్, కోల్ కతా నుంచి అధికంగా వస్తున్నాయని సర్వేలో వెళ్లడైంది. స్పామ్ ఎస్ఎంఎస్ లు రిసీవ్ చేసుకుంటున్న బాధితుల సంఖ్య ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువుగా ఉన్నారు. 

ఈఎంఐ విధానంలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది రూ.30 వేలు ఆపైన ధర పలికే ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి ఫోన్లకు స్పామ్ కాల్స్ తక్కువగా వస్తున్నాయని సర్వే సంస్థ వెల్లడించింది. రూ.15 వేల నుంచి రూ.20 వేల ఖరీదు చేసే ఫోన్లకు మాత్రం స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. సెల్ ఫోన్ యూజర్లు రోజుకు 13 గంటలపాటు స్పామ్ కాల్స్ తో ఇబ్బందులు పడుతున్నారని సర్వేలో తేలింది. పగటిపూట ఏడు గంటలు, రాత్రి సమయంలో ఆరు గంటలపాటు స్పామ్ కాల్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య సెల్ ఫోన్ యూజర్లకు అత్యధిక సంఖ్యలో స్పామ్ కాల్స్ వస్తున్నాయి. తరువాత రాత్రి 7 గంటల నుంచి 12 గంటల మధ్య కూడా ఈ కాల్స్ తో ఫోన్ మోగుతూనే ఉంటుందని వినియోగదారులు చెబుతున్నారు. ఈ తరహా ఫోన్లు వస్తున్న వినియోగదారులు వయసును బట్టి చూస్తే.. 18 ఏళ్లలోపు వారికి 0.8 శాతం, 18 నుంచి 25 ఏళ్లలోపు వారిలో 15 శాతం, 26 ఏళ్ల నుంచి 35 ఏళ్ళ వారిలో 28.2 శాతం, 36 నుంచి 60 ఏళ్ల వారిలో 48 శాతం, 60 ఏళ్ళు పైబడిన వారిలో ఎనిమిది శాతం మంది ఈ స్పామ్ కాల్స్ తో ఇబ్బంది పడుతున్నట్లు ఈ సర్వే పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్