టికెట్ కొనాలని అన్నందుకు కన్న బిడ్డను వదిలేశారు!

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| ప్రతీకాత్మక చిత్రం ||

టికెట్ లేదని కన్న బిడ్డను వదిలేసి వెళ్లేందుకు సిద్ధమైన తల్లిదండ్రులు. ఇజ్రాయెల్ ఎయిర్ పోర్టు లో ఓ తల్లిదండ్రులు తమ బిడ్డను వదిలేసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం గమనించిన ఎయిర్ పోర్టు సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకెళ్తే.. బెల్జియం దేశానికి చెందిన ఓ జంట తమ ఏడాదిన్నర మగబిడ్డను తీసుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఆ జంట దగ్గర రెండు టికెట్లు మాత్రమే ఉండడంతో తమ బిడ్డకు కూడా టికెట్ ఉండాలని సిబ్బంది చెప్పారు. ల్యాప్ సీటు టికెట్ కొనేందుకు సుమారు 25 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని లేదా ర్యాన్‌ఎయిర్ ప్రామాణిక ఛార్జీల ప్రకారం స్పెషల్ టికెట్ తీసుకోవాల్సి వస్తుందని టికెట్ తీసుకోకుండా తమ బిడ్డను చెక్ ఇన్ వద్ద వదిలేసి పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకుని ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం గమనించిన ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఆ తల్లిదండ్రులను అరెస్టు చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్