పంచాయతీ ఎన్నికలకు మోగనున్న నగారా.. ఈ నెల 15 లోపు షెడ్యూల్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ మేరకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంసిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త వాటర్ జాబితా సిద్ధమైంది. కులగలను కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల నిర్వహణపై సంకేతాలను ఇచ్చారు. తెలంగాణలో ఎన్నికల సందడి ప్రారంభం కాబోతోంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఐదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ మేరకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంసిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త వాటర్ జాబితా సిద్ధమైంది. కులగలను కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల నిర్వహణపై సంకేతాలను ఇచ్చారు. తెలంగాణలో ఎన్నికల సందడి ప్రారంభం కాబోతోంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఐదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. గతంలోనే ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ కొన్ని సాంకేతిక ఇబ్బందులు, కుల గణన వంటి అంశాల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కుల గణన పూర్తి కావడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈనెల 15వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా బొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులంతా సర్పంచ్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణలో ఇప్పటికే కుల గణన రిపోర్టు వచ్చేసింది. రానున్న ఎన్నికల్లో కూడా కుల గణన సంబంధించిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించిన నాయకులు, కార్యకర్తలకు స్థానిక సంస్థల్లో పదవులు దక్కేలా చేయాల్సిన బాధ్యత ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే ఉందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉండడంతో భారతీయ రాష్ట్ర సమితి, బిజెపి నాయకులు కూడా అప్రమత్తమయ్యారు. స్థానిక సంస్థల్లో సత్తా చాటడం ద్వారా వచ్చే ఎన్నికలు నాటికి బలంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని భావనతో భారతీయ రాష్ట్ర సమితి, బిజెపి నాయక కూడా ఎన్నికలను గట్టిగానే తీసుకుంటున్నారు. దీంతో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు రసవత్తంగా సాగే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అన్ని సవ్యంగా సాగితే మార్చినాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్