ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో టెర్రరిజం పెరుగుతోంది. దీనివల్ల ఆదేశాలు నష్టపోవడంతో పాటు సమీప దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ -2025 కీలక జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం ఉన్న దేశాలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పాకిస్తాన్ మరోసారి తనకు టెర్రరిజం లో తిరుగులేదని నిరూపించుకుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ ఏకంగా రెండో స్థానంలో నిలిచి టెర్రరిజానికి పాకిస్తాన్ అడ్డాగా ఎలా మారింది అన్న విషయాన్ని మరోసారి నిరూపించింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫోస ఉండగా, మూడో స్థానంలో సిరియా నిలిచింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో టెర్రరిజం పెరుగుతోంది. దీనివల్ల ఆదేశాలు నష్టపోవడంతో పాటు సమీప దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ -2025 కీలక జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం ఉన్న దేశాలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పాకిస్తాన్ మరోసారి తనకు టెర్రరిజం లో తిరుగులేదని నిరూపించుకుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ ఏకంగా రెండో స్థానంలో నిలిచి టెర్రరిజానికి పాకిస్తాన్ అడ్డాగా ఎలా మారింది అన్న విషయాన్ని మరోసారి నిరూపించింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫోస ఉండగా, మూడో స్థానంలో సిరియా నిలిచింది. పాకిస్తాన్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రిక్ - ఈ - తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వల్ల పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురించిన తాజా నివేదిక తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 163 దేశాల పరిస్థితిని వివరించింది. ఉగ్రవాద ఘటనల సంఖ్య, ప్రాణ నష్టం, గాయాలు, బందీలు, ఉగ్రవాదంపై ప్రభావం వంటి సూచికల ద్వారా ఈ సర్వేను వెల్లడించారు. గడిచిన 5 ఏళ్లుగా పాకిస్తాన్లో ఉగ్రవాద సంబంధిత మరణాల సంఖ్య స్థిరంగా పెరుగుతోందని, 2024లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు 45% వరకు భారీగా పెరిగాయని నివేదిక వెల్లడించింది. 2024లో పాకిస్తాన్ లో జరిగిన 52% మరణాలకు పాకు తాళిబండ్లు కారణమని వెల్లడించింది. పాకిస్తాన్లో ఫైబర్, బేలూచిస్తాన్ ప్రావిన్స్ లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 96 శాతం ఉగ్రదాడులు, మరణాలు సంభవించినట్లు వెల్లడించింది.
భారతదేశంలో ఈ జాబితాలో 14వ స్థానంలో నిలిచింది. టాప్ 10 దేశాలు జాబితాను పరిశీలిస్తే.. నాలుగో స్థానంలో మాలి, స్థానంలో నైజర్, ఆరో స్థానంలో నైజీరియా, ఏడో స్థానంలో సోమాలియా, ఏందో స్థానంలో ఇజ్రాయిల్, తొమ్మిదో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్, పదో స్థానంలో కామెరూన్ ఉన్నాయి. ఉగ్రవాదం అతి తక్కువగా ఉన్న దేశాలు జాబితాలో డెన్మార్క్ ఉంది. భారత పొరుగు దేశాలను గమనిస్తే బంగ్లాదేశ్ 35వ స్థానంలో, అమెరికా 34వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కంటే అమెరికా ఒక ర్యాంకు దిగువ ఉండడం గమనార్హం. మయన్మార్ 11వ స్థానంలో నిలిచింది. అనూప్యంగా ఇరాక్, ఇరాన్, పాలిస్తీనా వంటి దేశాలు టాప్ 10 జాబితాలో లేకపోవడం విశేషం.