|| పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ||
ఈవార్తలు, ఇంటర్నేషనల్ న్యూస్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. దుబాయ్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ మేరకు ముషారఫ్ కుటుంబసభ్యులు ధృవీకరించారని పాక్‌కు చెందిన జియో న్యూస్ స్పష్టం చేసింది. భారతదేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న ఢిల్లీలో పుట్టిన ముషారఫ్.. భారతదేశం నుంచి పాక్ విడిపోయాక.. కుటుంబంతో కలిసి పాక్‌కు వెళ్లిపోయారు. అనంతరం సైన్యంలో చేరి అంచెలంచెలుగా పాకిస్థాన్ దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001-2008 మధ్య ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు. అభిశంసనను తప్పించుకొనేందుకు పదవికి రాజీనామా చేశారు. పాక్ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన ముషారఫ్.. 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ఫే ప్రధాన కారకుడు. 2016 నుంచి దుబాయిలోనే ఉంటున్నారు.